పీవీ సింధుకు ఎన్ఏసీ జ్యూయలర్స్ అరుదైన బహుమతి..
- August 24, 2016
ఒలింపిక్స్‌లో పతకం సాధించి, మువ్వనెల్ల పతాకాన్ని ఎగురవేసి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు ఎన్ఏసీ జ్యూయలర్స్ అరుదైన బహుమతిని ప్రకటించింది. దాదాపు 6లక్షల ఖరీదైన నెక్లెస్‌ను సింధుకు అందించనున్నట్లు యాజమాన్యం తెలిపింది. సింధుతో పాటు ఒలింపిక్స్‌లో ఇతర పతకాలు సాధించిన క్రీడాకారులకు కూడా బహుమతులను ప్రకటించింది. కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్‌కు 3లక్షల విలువ చేసే రవ్వల నెక్లెస్‌ను ప్రదానం చేస్తున్నట్లు సదరు షోరూం ప్రకటించింది. జిమ్నాస్టిక్స్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చి, మెడల్‌ను తృటిని కోల్పోయిన దీపా కర్మాకర్‌కు లక్ష రూపాయలు విలువ చేసే బహుమతిని అందించనున్నట్లు ఎన్ఏసీ జ్యూయలర్స్ యాజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!







