ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- October 06, 2026
మస్కట్: ఒమన్ సమీపంలోని స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్లో పనామా జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక MT On Peaceపై దాడి జరిగినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలో మొత్తం 12 మంది సిబ్బంది గాయపడగా, వారిలో 11 మంది భారతీయులని వెల్లడించింది.
నౌకలో మొత్తం 19 మంది సిబ్బంది ఉండగా, వారిలో 17 మంది భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
ఒమన్ అధికారుల సహకారంతో గాయపడిన సిబ్బందిని నౌక నుంచి తరలించి, ఒమన్‌లోని ఖసబ్లో వైద్య చికిత్స అందిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా ఒమన్ అధికారులకు భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.
వాణిజ్య నౌకలపై వరుసగా జరుగుతున్న దాడుల పై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకునే దాడులు తక్షణమే నిలిపివేయాలని కోరింది.
అంతర్జాతీయ జలమార్గాల్లో నౌకాయానం, వాణిజ్య కార్యకలాపాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం
- సౌదీ అరేబియాకు బహ్రెయిన్ మద్దతు..!!







