జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష

- October 06, 2026 , by Maagulf
జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష

మచిలీపట్నం: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తన క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.

ప్రధానంగా గుడివాడ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు, గుడివాడ పట్టణంలోని రోడ్డు పనులు, నందివాడ మండలం పుట్టంగుంట వద్ద బుడమేరు వాగుపై నిర్మించనున్న బ్రిడ్జి పనులపై సమీక్ష నిర్వహించారు.

పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎంపీ బాలశౌరి, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేలా నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com