పాలనలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోడీ
- October 07, 2026
న్యూ ఢిల్లీ: 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో నరేంద్ర మోదీ పాలనా ప్రస్థానం ప్రారంభమైంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించి, రాష్ట్ర అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ‘గుజరాత్ మోడల్’ అభివృద్ధి ద్వారా దేశవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ పొందిన మోదీ, 2014లో భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. అక్కడితో ఆగకుండా 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయం సాధించి, వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వాధినేతగా పాతికేళ్లపాటు నిరంతరాయంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం భారత రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన మరియు విశేషమైన మైలురాయిగా నిలిచింది.
ప్రధాని మోదీ తన 25 ఏళ్ల పాలనలో దేశ రాజకీయ, ఆర్థిక, భద్రతా వ్యవస్థలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పెద్ద నోట్ల రద్దు (డెమోనెటైజేషన్), జిఎస్టి (GST) అమలు ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించగా, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు మరియు అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం ద్వారా దశాబ్దాల కలలను సాకారం చేశారు. అలాగే ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ పాకిస్తాన్‌పై చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా భారత రక్షణ రంగ శక్తిని ప్రపంచానికి చాటారు. వీటితో పాటు స్వచ్ఛ భారత్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, జన్ ధన్ యోజన వంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాల ద్వారా సమాజంలో చివరి వ్యక్తికి సహకారం అందిస్తూ, భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపే దిశగా అడుగులు వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- ప్రపంచ పర్యాటకులను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
- తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..71.23 లక్షల మందికి చోటు
- హౌసింగ్ నిబంధనల ఉల్లంఘన.. 4 భవనాలకు విద్యుత్ కట్..!!







