నల్లసముద్రంలో ట్యాంకర్ పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 23 మంది భారతీయులు సేఫ్
- October 07, 2026
ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి నల్లసముద్రంలో హింసాత్మక రూపం దాల్చాయి. రష్యాలోని ప్రముఖ పర్యాటక నగరమైన సోచి సమీపంలో లైబీరియా జెండాతో వెళ్తున్న భారీ ఆయిల్ ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడి కారణంగా ట్యాంకర్లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే, ఈ నౌకలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బంది కూడా భారతీయులే కావడం గమనార్హం. వీరి అందరినీ రష్యా రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు సురక్షితంగా రక్షించడంతో భారత్‌కు పెద్ద ఊరట లభించింది.
అదుపులోకి రాని మంటలు.. సముద్రంలోకి లీకవుతున్న ముడిచమురు
‘నేవల్ డ్రోన్ల’ ద్వారా ఈ దాడి జరిగిందని రష్యా వర్గాలు వెల్లడించాయి. మంటల తీవ్రత అత్యంత ఎక్కువగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది సైతం ప్రారంభంలో వాటిని నియంత్రించలేకపోయారు. ట్యాంకర్ నుంచి ముడిచమురు సముద్ర జలాల్లోకి లీకై దట్టమైన మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల తీవ్రత కొద్దిగా తగ్గిన తర్వాత అదార్పు చర్యలు చేపడతామని రష్యా అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, సోచి తీరంలో భారీగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ముందుజాగ్రత్తగా మేయర్ తీర ప్రాంతాలపై ఆంక్షలు విధించారు.
వాణిజ్య నౌకల పై పెరుగుతున్న దాడులు.. పర్యావరణ ముప్పు ఆందోళనలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇరు దేశాలు నల్లసముద్రంలో వాణిజ్య నౌకలను టార్గెట్ చేయడం పరిపాటిగా మారింది. రొమేనియా తీరంలో నౌక మునిగిపోయి ఒకరు మృతి చెందిన ఘటన జరిగిన మరుసటి రోజే ఈ దాడి జరగడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. తమ నగరాలపై రష్యా దాడులకు ప్రతిచర్యగానే చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్నామని ఉక్రెయిన్ వాదిస్తోంది. గతంలోనూ ఇలాంటి దాడుల వల్ల చమురు లీకై పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో, తాజా ఘటనతో మళ్లీ అలాంటి పర్యావరణ ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- నల్లసముద్రంలో ట్యాంకర్ పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 23 మంది భారతీయులు సేఫ్
- ప్రజా భద్రత, మాదకద్రవ్యాల నియంత్రణపై భారత్–దుబాయ్ మధ్య సహకారం బలోపేతం
- ఏపీలో పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా స్పెయిన్‌లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన
- పాలనలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోడీ
- దసరా పండక్కి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్..
- ఇరాన్ హోం మంత్రితో ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రి భేటీ..!!
- సహెల్ యాప్‌లో పీఏసీఐకి చెందిన 34 సేవలు..!!
- యూఏఈలో ఆహార పదార్థాలకు నిబంధనలు.. ఉల్లంఘిస్తే Dh500,000 వరకు ఫైన్..!!
- సౌదీ అరేబియా, బహ్రెయిన్ మధ్య చారిత్రక, బలమైన బంధం..!!
- జనరేషన్-జెడ్‌లో సోషల్ మీడియా వినియోగంతో మానసిక, శారీరక సమస్యలు..!!







