సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- October 08, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలపై మంగళవారం, బుధవారం జరిగిన దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 36 మంది గాయపడినట్లు సౌదీ సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది.
అధికారుల వివరాల ప్రకారం.. అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడుల్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో మొరాకో, అల్జీరియా దేశాలకు చెందిన మహిళా నివాసితులు ఉన్నారు. ఈ దాడిలో మరో 28 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్‌కు చెందిన ఇద్దరు నివాసితులు కూడా ఉన్నారు. వీరిలో కొందరి పరిస్థితి స్వల్పంగా ఉండగా, మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
ఇదే సమయంలో కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారు. మృతుడు సూడాన్‌కు చెందిన నివాసితుడిగా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు సౌదీ పౌరులు, ఇద్దరు ఈజిప్టు నివాసితులు, ఒకరు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఉన్నారు.
ఈ దాడుల కారణంగా విమానాశ్రయాల్లో కొంత ఆస్తి నష్టం కూడా సంభవించినట్లు సౌదీ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలి
తాజా వార్తలు
- విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
- అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- ఇక వాట్సాప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!







