అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- October 08, 2026
అబుదాబి: అల్ మఫ్రక్‌లోని అల్ రయాన్ వర్కర్స్ రెసిడెన్షియల్ సిటీలో కార్మికుల నివాస పరిస్థితులు, వారికి అందుతున్న సేవలు, సౌకర్యాలను నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్‌స్టిట్యూషన్ (NHRI) క్షేత్రస్థాయిలో పరిశీలించింది. NHRI చైర్‌పర్సన్ డాక్టర్ సలీమ్ సుహైల్ అల్ నెయాడి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ పర్యటన చేపట్టింది.
కార్మికులకు అందుతున్న నివాస సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధత, స్పందనా సామర్థ్యాలను బృందం పరిశీలించింది. కార్మికులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులు అందుతున్నాయా అనే అంశంపై ప్రత్యక్షంగా అంచనా వేసింది.
ఈ పర్యటనలో అబుదాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్, అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ, భద్రతా ప్రమాణాలు, అత్యవసర తరలింపు వ్యవస్థలు, కార్మికుల నివాస సముదాయాల అత్యవసర స్పందనా సామర్థ్యంపై వారు సాంకేతికంగా పరిశీలన నిర్వహించారు.
అల్ రయాన్ వర్కర్స్ రెసిడెన్షియల్ సిటీ అందిస్తున్న సమగ్ర సేవలను డాక్టర్ అల్ నెయాడి ప్రశంసించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్మికులకు మెరుగైన నివాస వాతావరణాన్ని అందిస్తున్న ఈ నగరం.. కార్మికుల హక్కులు, సంక్షేమం పట్ల యూఏఈకి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
ఈ పర్యటన ముగింపులో NHRI జాతీయ మానవ హక్కుల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అబుదాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్, సివిల్ డిఫెన్స్ అథారిటీ, అల్ రయాన్ వర్కర్స్ సిటీ యాజమాన్యానికి డాక్టర్ అల్ నెయాడి కృతజ్ఞతలు తెలిపారు.
NHRI నిర్వహిస్తున్న నేషనల్ ఫీల్డ్ విజిట్స్ ప్రోగ్రామ్లో భాగంగా ఈ పర్యటన జరిగింది. కార్మికుల నివాస, పని పరిస్థితులను పరిశీలించడం, వారికి గౌరవప్రదమైన గృహ వసతి అందుతున్నదా అనే అంశాన్ని అంచనా వేయడం, కార్మికులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
కార్మికుల భద్రత, ఆరోగ్యం, గౌరవం, హక్కుల పరిరక్షణకు యూఏఈ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం ఆధునిక చట్టపరమైన వ్యవస్థతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమగ్ర కార్మికుల నివాస నగరాలను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కార్మికుల సంక్షేమం కోసం చేపడుతున్న ఈ చర్యలు యూఏఈలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడంతో పాటు, దేశ సుస్థిర అభివృద్ధికి అవసరమైన మానవ వనరులను ఆకర్షించడంలో కూడా దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు
- అబుదాబిలో కార్మికుల నివాస పరిస్థితులపై మానవ హక్కుల సంస్థ క్షేత్రస్థాయి పరిశీలన
- సౌదీ విమానాశ్రయాలపై హౌతీ దాడులు.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
- ఇక వాట్సాప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికెట్
- దుబాయ్‌లో ప్రాంతాల వారీగా రంగులతో కొత్త స్ట్రీట్ సూచికలు
- విద్యార్థులే వికసిత్ భారత్ నిర్మాణ శిల్పులు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- రేపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- రియాద్‌కు ఉత్తరంగా హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ కూల్చివేత..!!
- వికలాంగులు, వృద్ధులకు ఆర్థిక సేవలు.. ఖతార్ సెంట్రల్ బ్యాంక్ కీలక ఆదేశాలు..!!
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్‌పై కొత్త నిబంధనలు..!!







