భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- October 08, 2026
న్యూఢిల్లీ: భారత్, ఒమన్ దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు ఇరుదేశాలు చర్చలు జరిపాయి. న్యూఢిల్లీలో భారత్–ఒమన్ స్ట్రాటజిక్ కన్సల్టేషన్ గ్రూప్ 15వ సమావేశం జరిగింది. సమావేశానికి ఒమన్ తరఫున విదేశాంగ మంత్రిత్వ శాఖ రాజకీయ వ్యవహారాల అండర్‌సెక్రటరీ షేక్ ఖలీఫా అలీ అల్ హార్తీ, భారత్ తరఫున విదేశాంగ మంత్రిత్వ శాఖ కాన్సులర్, పాస్‌పోర్ట్, ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ నేతృత్వం వహించారు. ఇరుదేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)ను మరింత క్రియాశీలం చేసే మార్గాలపై ప్రధానంగా చర్చించారు. దీని ద్వారా వాణిజ్యం, పెట్టుబడుల మార్పిడిని పెంచడంతో పాటు ఉమ్మడి ఆర్థిక సహకారానికి కొత్త అవకాశాలను విస్తరించాలని ఇరుపక్షాలు అభిప్రాయపడ్డాయి.
అలాగే పౌర విమానయానం, సముద్ర రవాణా, లాజిస్టిక్స్, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత పెంచే అంశాలను సమీక్షించారు. పలు కాన్సులర్ అంశాలు, ద్వైపాక్షిక ఒప్పందాలపైనా చర్చ జరిగింది.ప్రాంతీయ పరిణామాలపై కూడా ఇరుదేశాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సమావేశంలో భారత్‌లోని ఒమన్ రాయబారి ఈసా సాలెహ్ అల్ షైబానీతో పాటు ఇరుదేశాలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!
- సౌదీ అరేబియాలో ఏడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు..!!
- లోక్ భవన్లో 77వ టీబీ సీల్ విక్రయ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- గ్రామీణ కళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్–ఒమన్ ఆర్థిక భాగస్వామ్యంపై కీలక చర్చలు..!!
- ప్రపంచ పర్యాటకులను భాగస్వాములుగా ఆహ్వానిస్తున్నాం: మంత్రి కందుల దుర్గేష్
- తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..71.23 లక్షల మందికి చోటు
- హౌసింగ్ నిబంధనల ఉల్లంఘన.. 4 భవనాలకు విద్యుత్ కట్..!!







