ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్‌లైన్ వేలం..!!

- October 08, 2026 , by Maagulf
ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్‌లైన్ వేలం..!!

దోహా: ఖతార్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఆధ్వర్యంలో ఇంపౌండ్ చేసిన వాహనాల విక్రయానికి ఆన్‌లైన్ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ‘సౌమ్’ (Soum) యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వేలం అక్టోబర్ 11న సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 12న సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది.

వేలంలో ఉంచనున్న వాహనాల ఫొటోలను అక్టోబర్ 8నుంచి సౌమ్ యాప్‌లో అందుబాటులో ఉంచనున్నారు. వాహనాలను ప్రత్యక్షంగా పరిశీలించాలనుకునే వారు అక్టోబర్ 9 నుంచి 11 వరకు ఇండస్ట్రియల్ ఏరియాలోని స్ట్రీట్ 52లో ఉన్న వెహికల్ ఇంపౌండ్ యార్డ్‌ను సందర్శించవచ్చు.

వాహనాల పరిశీలనకు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం కల్పించారు.ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే వేలాల్లో ప్రజలు ఎలక్ట్రానిక్ విధానంలో పాల్గొనేందుకు సౌమ్ యాప్‌ను ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com