అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- October 10, 2026
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 షాపింగ్ సేల్ చారిత్రాత్మక ఆరంభాన్ని నమోదు చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే కొనుగోలుదారులు ఆర్డర్ చేసిన ఉత్పత్తుల సంఖ్య 100 శాతానికి పైగా పెరిగిందని అమెజాన్ ఇండియా వెల్లడించింది. అక్టోబర్ 9న బెంగళూరులో ప్రకటించిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా ప్రతి పిన్‌కోడ్ నుంచి వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, గృహోపకరణాలు, కిచెన్ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులను ఆర్డర్ చేశారు. కొనుగోళ్లను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు EMI, నో-కాస్ట్ EMI, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉండటంతో వినియోగదారుల నుంచి భారీ స్పందన లభించింది. ప్రతి ఇద్దరు కొనుగోలుదారుల్లో ఒకరు EMI ద్వారా షాపింగ్ చేయగా, కొనుగోలు చేసిన ప్రతి మూడు ఉత్పత్తుల్లో ఒకదానిపై క్యాష్‌బ్యాక్ లభించినట్లు సంస్థ తెలిపింది. ప్రైమ్ సభ్యులు ప్రత్యేక ఆఫర్ల ద్వారా గత ఏడాదితో పోలిస్తే 100 శాతానికి పైగా ఆదా చేసినట్లు పేర్కొంది. డెలివరీ వేగంలోనూ అమెజాన్ కొత్త రికార్డులను నమోదు చేసిందని, అమెజాన్ నౌ సేవలు అందుబాటులో ఉన్న 120కి పైగా నగరాల్లో ప్రతి రెండు ఉత్పత్తుల్లో ఒకదాన్ని కేవలం నిమిషాల్లోనే డెలివరీ చేసినట్లు వెల్లడించింది. అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, కస్టమర్ల స్పందన, ఆర్డర్ల సంఖ్య, డెలివరీ వేగం తమ అంచనాలను మించాయని తెలిపారు.
స్మార్ట్‌ఫోన్ల నుంచి ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తుల వరకు భారీ డిమాండ్
ఈ పండుగ సేల్‌లో దాదాపు అన్ని విభాగాల్లోనూ వినియోగదారులు అధికంగా కొనుగోళ్లు చేసినట్లు అమెజాన్ వెల్లడించింది. ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 70 శాతం పెరగగా, మ్యాక్‌బుక్ నియో అమ్మకాలు సాధారణ రోజులతో పోలిస్తే 65 రెట్లు అధికంగా నమోదయ్యాయి. ప్రీమియం స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్ల విక్రయాలు 80 రెట్లు పెరిగాయి. గృహ వినోద విభాగంలో టీవీలు, హోమ్ థియేటర్ సిస్టమ్‌లకు మంచి డిమాండ్ లభించగా, సాధారణ రోజుతో పోలిస్తే హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అమ్మకాలు 77 రెట్లు పెరిగాయి. పెద్ద గృహోపకరణాల విక్రయాలు 50 రెట్లు అధికంగా నమోదయ్యాయి. ఫ్యాషన్ విభాగంలో అమ్మకాలు ఏడు రెట్లు పెరగగా, ప్రతి సెకనుకు ఏడు జతల బూట్లు అమ్ముడయ్యాయి. మహిళల ఎత్నిక్ వేర్, పురుషుల జీన్స్, షర్టులు, టీ-షర్టులకు కూడా భారీ స్పందన లభించింది. బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగంలో ప్రీమియం చర్మ, జుట్టు సంరక్షణ ఉత్పత్తులు సాధారణ రోజుతో పోలిస్తే ఐదు రెట్లు అమ్ముడయ్యాయి. కే-బ్యూటీ ఉత్పత్తుల విక్రయాలు నాలుగు రెట్లు పెరిగాయి. ఆరోగ్యం, జీవనశైలికి సంబంధించిన ఉత్పత్తుల్లోనూ వినియోగదారులు ఆసక్తి చూపించారు. ఎయిర్ ఫ్రయ్యర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ల అమ్మకాలు 30 రెట్లు, జ్యూసర్ల అమ్మకాలు 23 రెట్లు, ఎస్ప్రెస్సో మెషీన్ల అమ్మకాలు 16 రెట్లు పెరిగినట్లు సంస్థ తెలిపింది. మెట్రో నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు విస్తరించిన ఈ కొనుగోళ్ల జోరు, పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న ఆదరణను సూచిస్తోంది. రాబోయే రోజుల్లోనూ వినియోగదారులకు ఆకర్షణీయమైన డీల్స్, విస్తృత ఉత్పత్తుల ఎంపిక, వేగవంతమైన డెలివరీలను అందించడంపై దృష్టి సారిస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







