‘సీన్’ మ్యూజికల్ జర్నీ షురూ- ఎనర్జిటిక్ నెంబర్ ‘అమ్మో ఇది ఎవర్రా’ రిలీజ్
- October 10, 2026
హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మేకర్స్ టైటిల్ టీజర్‌ను విడుదల చేసి సినిమాలోని క్విర్కీ, ఎంటర్‌టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేశారు.
ఇప్పుడు మ్యూజికల్ జర్నీని ఫస్ట్ సింగిల్ ‘అమ్మో ఇది ఎవర్రా’తో ప్రారంభించారు. సుశిన్ శ్యామ్ కంపోజ్ చేసిన ఈ పాట ఫుట్‌ట్యాపింగ్ బీట్స్, వెంటనే ఆకట్టుకునే రిథమ్‌తో అదిరిపోయే ఎనర్జీని అందిస్తోంది. పాటలోని వైబ్రెంట్ మూడ్‌కు తగ్గట్టుగా ఈ అప్‌బీట్ కంపోజిషన్ ఆకట్టుకుంది. రాకేందు మౌళి అందించిన లిరిక్స్ నజ్రియా నజీమ్ పాత్రలోని అగ్రెసివ్, ఎనర్జిటిక్ నేచర్‌ను ప్రజెంట్ చ్ర్స్తునాయి. సింగర్ వినాయక్ తన లైవ్లీ, ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటకు మరింత ఎనర్జీతీసుకొచ్చారు.
వీడియో గేమ్ కాన్సెప్ట్ చుట్టూ ఈ పాటను క్రియేటివ్‌గా డిజైన్ చేశారు. కొరియోగ్రాఫర్ రాజ్ ప్రియన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ యూనిక్ ఐడియా పాటకు ప్లేఫుల్ టచ్‌ను తీసుకొచ్చింది. ఫన్, క్విర్కీ ఎలిమెంట్స్‌తో పాటను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా నజ్రియా నజీమ్ పాటంతా ఫుల్ ఎనర్జీ, ఉత్సాహంతో కనిపించారు. ‘అమ్మో ఇది ఎవ్వర్రా’ పాట అదిరిపోయేలా ఉండటంతో ‘సీన్’ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు ఇది మంచి ఆరంభంగా నిలిచింది.
వినీత్ అగస్టిన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సుశిన్ శ్యామ్ సంగీతం సమకూరుస్తున్నారు. అజ్మల్ సాబు ఎడిటింగ్, అశ్విని కాలే ప్రొడక్షన్ డిజైన్.
‘సీన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







