అమెరికా పశ్చిమ ప్రాంతాన్ని దావానలం వణికిస్తోంది..
- August 24, 2016
విస్తరిస్తున్న దావానలం..ఊళ్లకు ఊళ్లు ఖాళీచేస్తున్న జనంలాస్ ఏంజిలెస్, అమెరికా పశ్చిమ ప్రాంతాన్ని దావానలం వణికిస్తోంది. అడవుల్లో పుట్టిన కార్చిచ్చు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ఆస్తులను బుగ్గిచేస్తోంది. ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించడంతో జనం ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాషింగ్టన్ రాష్ట్రం 20 కౌంటీల్లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని విధిస్తున్నట్లు గవర్నర్ జే ఇన్స్లీ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలంతా కలిసికట్టుగా ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.దావానలం ఇప్పటివకు గ్రామీణ ప్రాంతాల్లోని 25 భవనాలను నాశనం చేసిందని, వందల భవనాలకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. చెర్రీ రోడ్లో కార్చిచ్చుకు 31,660 ఎకరాలు, కహ్లోట్సలో 20 వేల ఎకరాలు బూడిదయ్యాయి. ఇక్కడ మంటలను అదుపుచేయడం కుదరడం లేదు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









