ఐఎస్‌పై యుద్ధ సన్నాహాలు....
- August 24, 2016
ఐఎస్‌పై యుద్ధ సన్నాహాలుమిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంఉగ్రశిబిరాలపై బాంబులు
ఇస్తాంబుల్/బ్యాంకాక్/ఢాకా/లండన్, ఆగస్టు 24: సిరియాలో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) జిహాదీల ఏరివేతకు సంకీర్ణ సేనల సాయంతో టర్కీ ఆపరేషన్ చేపట్టింది. సిరియా సరిహద్దుల్లోని కీలక పట్టణం జరాబులుస్ నుంచి ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు బుధవారం భారీసంఖ్యలో యుద్ధట్యాంకులు, ప్రత్యేక బలగాలను తరలించింది. జరాబులుస్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో ఉన్న ఐఎస్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. జిహాదీల నుంచి ఈ పట్టణానికి విముక్తి కల్పించడమే లక్ష్యమని టర్కీ ప్రకటించింది.
దీంతో ఆరేళ్లుగా అంతర్యుద్ధంతో చితికిపోయిన సిరియాలో కుర్దులతో ఢీకొట్టేందుకు తెరతీసినట్టయింది. అమెరికా సంకీర్ణసేనలతో పాటు తమ బలగాలు దాడులను ముమ్మరం చేశాయని టర్కీ ప్రధాని కార్యాలయం పేర్కొంది. టర్కీ ట్యాంకులు వెన్నంటే పెద్దసంఖ్యలో సిరియా రెబెల్స్ టర్కీ సరిహద్దులు దాటి సిరియాలోకి ప్రవేశించారని మానవ హక్కుల సంఘం తెలిపింది. కాగా, థాయ్‌లాండ్‌ను బాంబుపేలుళ్లు కుదిపేశాయి.
ముస్లిం ప్రాబల్య దక్షిణ ప్రావిన్స్ పట్టానిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో సంభవించిన పేలుళ్లలో ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. నిరుడు బంగ్లాదేశ్‌లో దాడులకు పాల్పడిన ఆరుగురు ఇస్లామిస్ట్ మిలిటెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. దేశరాజధాని ఢాకా శివారులోని టోంగీ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.కాగా స్టాన్స్టెడ్ నుంచి ఇటలీలోని నేపుల్స్కు వెళ్తున్న భారత సంతతి ముస్లింలను లండన్ పోలీసులు విమానం నుంచి దింపేశారు. వారిని ఐఎస్ ఉగ్రవాదులుగా భావించి.. తోటి ప్రయాణికుడు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







