గుల్మార్గ్‌లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం

- October 10, 2026 , by Maagulf
గుల్మార్గ్‌లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం

గుల్మార్గ్, కాశ్మీర్: లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో భాగంగా రెండో రోజు తొలి సమావేశం కాశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్, ఎంపీ వల్లభనేని బాలశౌరి అధ్యక్షత వహించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రతినిధులతో ఈ సమావేశం జరిగింది.

సమావేశానికి ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజింగ్ డైరెక్టర్ రవి రంజన్, కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ బి.కె. సింగ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.పరమశివం ఎంపీ బాలశౌరికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.

కమిటీ అధ్యయన పర్యటనలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రతినిధులతో నిర్వహించిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన ద్వారా సంబంధిత అంశాల పై కమిటీ అధ్యయనం కొనసాగిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com