బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- October 11, 2026
మనామా: బహ్రెయిన్‌లోని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను సెప్టెంబర్ నెలలో మొత్తం 22,486 మంది సందర్శించారు. వీరిలో విదేశీ పర్యాటకుల సంఖ్య పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో అధికంగా నమోదైంది. బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ విడుదల చేసిన గణాంకాలను బహ్రెయిన్ ఓపెన్ డేటా పోర్టల్‌లో ప్రచురించారు. ఈ జాబితాలో బహ్రెయిన్ కోట (Bahrain Fort) అగ్రస్థానంలో నిలిచింది. ఈ చారిత్రక ప్రదేశాన్ని ఒక్క నెలలోనే 12,960 మంది సందర్శించారు. మొత్తం వారసత్వ ప్రదేశాల సందర్శనల్లో సగానికి పైగా వాటా ఈ కోటదే కావడం విశేషం.
విదేశీ పర్యాటకుల నుంచి బహ్రెయిన్ కోటకు ఆదరణ
బహ్రెయిన్ కోటను సందర్శించిన వారిలో విదేశీయులు అత్యధికంగా 6,022 మంది ఉండగా, బహ్రెయిన్ పౌరులు 5,694 మంది సందర్శించారు. అలాగే జీసీసీ దేశాల నుంచి 907 మంది, ఇతర అరబ్ దేశాల నుంచి 218 మంది, బృందాలుగా 119 మంది వచ్చారు.
సెప్టెంబర్ నెలలో పలు చారిత్రక, సాంస్కృతిక ప్రాంతాలను సందర్శించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
- ట్రీ ఆఫ్ లైఫ్, విజిటర్ సెంటర్: 2,687 మంది
- బహ్రెయిన్ నేషనల్ మ్యూజియం: 2,539 మంది
- కల్చరల్ హాల్: 1,023 మంది
- బహ్రెయిన్ నేషనల్ థియేటర్: 800 మంది
- బు మహేర్ కోట: 585 మంది
- పెర్లింగ్ పాత్ విజిటర్ సెంటర్: 463 మంది
- అల్ జస్రా హ్యాండీక్రాఫ్ట్స్ సెంటర్: 354 మంది
- బహ్రెయిన్ ఫోర్ట్ సైట్ మ్యూజియం: 330 మంది
- ఖలీఫయ్యా లైబ్రరీ: 214 మంది
- సార్ సెటిల్‌మెంట్: 202 మంది
- ఆర్ట్స్ సెంటర్: 146 మంది
- షేక్ సల్మాన్ బిన్ అహ్మద్ అల్ ఫతే కోట: 64 మంది సందర్శించారు.
ట్రీ ఆఫ్ లైఫ్‌కు విదేశీయులే ఎక్కువ
బహ్రెయిన్‌లోని ప్రసిద్ధ ట్రీ ఆఫ్ లైఫ్‌ను సందర్శించిన 2,687 మందిలో 2,175 మంది విదేశీయులు ఉన్నారు. అరబ్ దేశాల నుంచి 286 మంది, బహ్రెయిన్ పౌరులు 96 మంది, ఇతర జీసీసీ దేశాల నుంచి 53 మంది వచ్చారు. పర్యాటక సంస్థల ద్వారా 56 మంది సందర్శించగా, 15 మంది వీఐపీలు, ఆరు మంది ప్రత్యేక బృందాలుగా వచ్చారు. ఇక బహ్రెయిన్ నేషనల్ మ్యూజియాన్ని సందర్శించిన 2,539 మందిలో 1,648 మంది విదేశీయులు ఉన్నారు. జీసీసీ దేశాల నుంచి 403 మంది, బహ్రెయిన్ పౌరులు 321 మంది, అరబ్ దేశాల నుంచి 63 మంది, వీఐపీలు 20 మంది సందర్శించారు.
కొన్ని ప్రాంతాల్లో స్థానికులు అధికం
కల్చరల్ హాల్‌ను సందర్శించిన 1,023 మందిలో 542 మంది బహ్రెయిన్ పౌరులు కాగా, 481 మంది విదేశీయులు. బహ్రెయిన్ నేషనల్ థియేటర్‌కు వచ్చిన 800 మందిలో 700 మంది ప్రత్యేక బృందాలుగా, మరో 100 మంది వీఐపీలు ఉన్నారు. అల్ జస్రా హ్యాండీక్రాఫ్ట్స్ సెంటర్‌ను సందర్శించిన 354 మందిలో 193 మంది బహ్రెయిన్ పౌరులు కాగా, పర్యాటక సంస్థల ద్వారా 101 మంది వచ్చారు. ఆర్ట్స్ సెంటర్‌ను సందర్శించిన మొత్తం 146 మందీ విజిటర్స్ బహ్రెయిన్ పౌరులే కావడం విశేషం.
తక్కువ మంది సందర్శించిన చారిత్రక ప్రదేశాలు
మిగిలిన కొన్ని వారసత్వ ప్రాంతాల్లో సందర్శకుల సంఖ్య తక్కువగా నమోదైంది.
- అల్ జస్రా హౌస్ – 35 మంది
- ఫఖ్రో హౌస్ – 32 మంది
- ఆలి బరియల్ మౌండ్స్ – 29 మంది
- డైవింగ్ హౌస్ – 19 మంది
- అల్ అలావి హౌస్ – 4 మంది సందర్శించారు.
ఈ గణాంకాలు బహ్రెయిన్‌లోని చారిత్రక కోటలు, మ్యూజియంలు, సాంస్కృతిక కేంద్రాలపై పర్యాటకుల ఆసక్తిని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా బహ్రెయిన్ కోట, ట్రీ ఆఫ్ లైఫ్, నేషనల్ మ్యూజియం విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని తెలియజేస్తున్నాయని టూరిజానికి చెందిన ఏజెన్సీలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







