ఊపిరితిత్తుల్లో నాడ్యూల్‌.. పోప్‌ లియోకు త్వరలో శస్త్రచికిత్స

- October 12, 2026 , by Maagulf
ఊపిరితిత్తుల్లో నాడ్యూల్‌.. పోప్‌ లియోకు త్వరలో శస్త్రచికిత్స

వాటికన్‌: పోప్‌ లియో XIVకు ఊపిరితిత్తుల్లో నాడ్యూల్‌ (చిన్న కణజాల గడ్డ) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు త్వరలో శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు సమాచారం.
వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో భక్తులను ఉద్దేశించి మాట్లాడిన పోప్‌ లియో XIV ఈ విషయాన్ని వెల్లడించారు. శస్త్రచికిత్సకు ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారైందని, రానున్న రోజుల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.

ఊపిరితిత్తుల్లో గుర్తించిన నాడ్యూల్‌ను చాలా ప్రారంభ దశలోనే గుర్తించారని, అది ఒక నిర్దిష్ట ప్రాంతానికే పరిమితమై ఉందని పోప్‌ పేర్కొన్నారు.వైద్యులు ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, నాడ్యూల్‌ స్వభావం, శస్త్రచికిత్సకు సంబంధించిన ఇతర వైద్య వివరాలపై మరింత సమాచారం వెల్లడించాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com