సీఎం విజయ్ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా..
- October 12, 2026
చెన్నై:ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా రణబాలి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్స్ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇదివరకే ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
“అత్యంత ఆత్మీయులైన విజయ్ దళపతితో గడిపిన సమయం ఎంతో అద్భుతంగా ఉంది. రోజంతా పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. అలాగే జీవితం, పని , ప్రపంచం పట్ల తన వ్యక్తిగత ఆలోచనలను పంచుకున్నారు. కేవలం ఒక్క భేటీతోనే ఆయన నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా మారిపోయారు. మళ్ళీ కలుద్దాం, నా ప్రేమ, గౌరవంతో విజయ్ దేవరకొండ” అంటూ ట్వీట్ చేశారు విజయ్. ఈ పోస్ట్ ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఇక రణబాలి సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 16 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాను విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. స్వాతంత్రం రాకముందు రాయలసీమలో ఎదుర్కొన్న పరిస్థితులను ఈ సినిమాగా తెరకెక్కించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







