‘హైడ్ & సిల్క్’ మంచి టీమ్‌తో కలిసి చేసిన బ్యూటీఫుల్ సినిమా: హీరో సుహాస్

- October 13, 2026 , by Maagulf
‘హైడ్ & సిల్క్’ మంచి టీమ్‌తో కలిసి చేసిన బ్యూటీఫుల్ సినిమా: హీరో సుహాస్

'మండాడి’ బ్లాక్‌బస్టర్ విజయంతో జోష్‌లో ఉన్న యంగ్ హీరో సుహాస్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాజేంద్ర బాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ఆయన కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. తమిళం, మలయాళంలో ఇప్పటికే 18 సినిమాలను నిర్మించిన స్టోన్ బెంచ్ స్టూడియో అధినేత కార్తికేయన్ సంతానం.. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. నాలుగు సినిమాలతో తెలుగులో తన నిర్మాణ ప్రయాణాన్ని ప్రారంభించనున్న ఆయన, ఈ ప్రాజెక్ట్ కోసం మిస్రిలాల్ పిక్చర్స్‌  వర్తికా జైన్‌తో చేతులు కలిపారు. ‘లబ్బర్ పందు’, ‘డీసీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంజన కృష్ణమూర్తి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.  

‘హైడ్ & సిల్క్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ వీడియోలో సుహాస్ చీర నేస్తూ కనిపిస్తారు. ఆయనకు తోడుగా సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఇంటెన్స్ వాయిస్ వినిపిస్తుంది. ఆయన చెప్పే భావోద్వేగపూరితమైన మాటలు ఓ కవితాత్మక ఆలోచనను ఆవిష్కరిస్తాయి. ప్రతి చీర ఓ అమ్మాయిని ఎంచుకుంటుంది, దాని అందం కేవలం నేతపనిలోనే ఉండదని వాయిస్ ఓవర్ ప్రజెంట్ చేస్తోంది. చేనేత కళకు, విధికి మధ్య ఉన్న ఈ కవితాత్మకమైన అనుబంధం గ్లింప్స్‌కు ప్రత్యేకమైన ఎమోషనల్ టచ్ ను అందిస్తోంది.

మగ్గం ముందు సుహాస్ కనిపించే తీరు, సంజన కృష్ణమూర్తి హుందాతనం, అందం విజువల్స్‌కు  ఆకర్షణను తీసుకొచ్చాయి. ఈ తొలి గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రానికి ప్రతిభావంతమైన సాంకేతిక బృందం పనిచేస్తోంది. ‘3 బీహెచ్‌కే’ చిత్రానికి పనిచేసిన అమృత్ రామనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ  , షఫీక్ మొహమ్మద్ అలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘యానిమల్’, ‘పేటా’ చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. జాషువా స్టంట్స్, ప్రవీణ్ రాజా కాస్ట్యూమ్స్, షెరీఫ్ కొరియోగ్రఫీ నిర్వహిస్తున్నారు.

కృష్ణకాంత్ పాటలు రాస్తుండగా, సౌండ్ డిజైనింగ్‌ను సురేన్ జీ, అలగియా నిర్వహిస్తున్నారు. సౌండ్ మిక్సింగ్ సురేన్ జీ.  అమోల్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. విభిన్నమైన టైటిల్, ఆకట్టుకునేజోడి,  పోయిటిక్ గ్లింప్స్‌తో ‘హైడ్ & సిల్క్’ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. కార్తికేయన్ సంతానం స్టోన్ బెంచ్ స్టూడియో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న తొలి చిత్రంగా ఈ సినిమా నిలవనుంది.

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సుహాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కార్తీక్ గారికి, బాలాకు, అందరికీ థ్యాంక్యూ. చాలా పెద్ద టీమ్ కలిసి పనిచేసిన సినిమా ‘హైడ్ & సిల్క్’. ‘పేట’ సినిమా చేసినప్పుడు కార్తీక్ సుబ్బరాజు గారు, టీం  కలిసి బాలాకు ఒక మాట ఇచ్చారు. తను సినిమా చేస్తే అందరం వచ్చి కలిసి పనిచేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ అందరూ కలిసి వచ్చి హైడ్ & సిల్క్ సినిమా చేశారు. తనకు సపోర్ట్ చేయడం వల్ల మా అందరికీ హెల్ప్ అయింది. ఇది చాలా మంచి టీమ్. ఈ వేడుకకు వచ్చిన కార్తీక్ సుబ్బరాజు గారికి థ్యాంక్యూ. ఇందులో మంచి పాత్రలు చేసిన తనికెళ్ల భరణి గారికి, నందుకు థ్యాంక్యూ. ఇది మా టీమ్ అందరి సినిమా. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా సినిమా పూర్తయ్యేది కాదు. ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ థ్యాంక్యూ.

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ బాలా ‘జిగర్తండా’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాడు. తర్వాత నేను చేసిన సినిమాలకు ఫస్ట్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. హీరోలందరూ తనతో ఎంతో స్నేహంగా ఉంటారు. మాస్, కమర్షియల్, యాక్షన్ సినిమాలు చేయడం తనకి ఇష్టం. అయితే తొలి సినిమా చేసే ప్రతి దర్శకుడికీ బడ్జెట్ పరంగా కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకే ఫస్ట్ సినిమాకు ఒక సింపుల్ స్టోరీ తీసుకుని, ఫిల్మ్‌మేకర్‌గా తన ప్రతిభ ఏంటో చూపించే సినిమా చేస్తే బాగుంటుందని తనకు సూచించాను. అలాగే ప్రేమకథను తీసుకోమని కూడా చెప్పాను. అప్పుడు తను ఈ ఐడియాతో వచ్చాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. చాలా అద్భుతంగా రాశాడు. ఇందులో ఎమోషన్స్, కామెడీ అన్నీ బాగుంటాయి. కార్తికేయన్ గారు ఈ సినిమాను తెలుగులో చేయాలనుకున్నారు.  సుహాస్ కి ఈ కథ చెప్పగానే ఆయనకి చాలా నచ్చింది. టీజర్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. బాలా విషయంలో మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. తన గురించి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను.


డైరెక్టర్ రాజేంద్ర బాల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా కమిట్ అయిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కార్తీక్ సుబ్బరాజు గారు మా గురువు. ‘జిగర్తండా’ సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగే చూస్తున్నారు. ఆయన  మనం మాట్లాడకూడదు, మన సినిమా మాట్లాడాలని చెప్తుంటారు. ఈ సినిమా కూడా మాట్లాడుతుందని నమ్ముతున్నాను. కచ్చితంగా కార్తీక్ సుబ్బరాజు గారు గర్వపడే సినిమా చేశానని నమ్ముతున్నాను. సుహాస్ గారికి ఈ కథ చెప్పగానే ఆయనకు చాలా నచ్చింది. చాలా అద్భుతంగా చేశారు. సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ఒక అద్భుతమైన టీమ్‌తో కలిసి ఒక పొయెటిక్ లవ్ స్టోరీని తీశారు. బాలా చాలా క్లారిటీతో ఈ కథను రాసుకున్నాడు. అంతే క్లారిటీగా తీశాడు. నిజంగా ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఖాయం. సినిమా చాలా రియలిస్టిక్‌గా, అద్భుతమైన ఆర్ట్ డైరెక్షన్‌తో ఉంటుంది. మా కెమెరామన్ ప్రాణం పెట్టేశాడు. సుహాస్ చాలా హంబుల్ పర్సన్. తనతో కలిసి ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. చాలా కబుర్లు చెప్పుకున్నాం. నందు ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశాడు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా కెరీర్‌లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్.

యాక్టర్ నందు మాట్లాడుతూ.. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ తెలుగులో కూడా చాలా పెద్ద సంస్థగా నిలబడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు థ్యాంక్యూ సో మచ్. రాజేంద్ర బాల చాలా క్లారిటీ, కన్విక్షన్ ఉన్న డైరెక్టర్. ఇందులో చాలా పెద్ద సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్స్ ఉన్నారు. వీళ్లందరూ కలిసి ఒక కొత్త డైరెక్టర్‌ను నమ్మారంటే, తనలో ఎంత సత్తా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా మంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. షూటింగ్ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా, అనుకున్నట్లుగా చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సుహాస్, తనికెళ్ల భరణి గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

లిరిక్ రైటర్ కృష్ణకాంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రాజేంద్ర బాల కథను అద్భుతంగా రాసుకున్నాడు. చేనేత నేపథ్యంలో రాసుకున్న అద్భుతమైన ప్రేమకథ ఇది. సినిమా చూశాను. కథ చాలా అద్భుతంగా ఉంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు మనసును కదిలించేస్తాయి. ఈ సినిమాలో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌కు థ్యాంక్యూ. చాలా పాజిటివ్ టీమ్‌తో కలిసి చేసిన సినిమా ఇది. ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. విజువల్‌గా కూడా సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది.

ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో భాగమవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ. సుహాస్ గారు చాలా హంబుల్ పర్సన్. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది.

డీఓపీ కార్తిక్ పళని మాట్లాడుతూ.. ఫస్ట్ సినిమా ప్రతి ఒక్కరికీ చాలా స్పెషల్. బాలాకు ఇది ఫస్ట్ సినిమా. ఇందులో మేమందరం కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మాలో చాలామంది గతంలో కూడా కలిసి పనిచేశాం. ఇండిపెండెంట్ టెక్నీషియన్స్‌గా ఉన్న మేమంతా ఇప్పుడు కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమకు థ్యాంక్యూ సో మచ్.

ప్రొడ్యూసర్ వర్తికా జైన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.   మా పేరెంట్స్‌కు థ్యాంక్యూ. వాళ్ల సపోర్ట్‌తోనే నేను ఇక్కడి వరకు వచ్చాను. చాలా అద్భుతమైన నటీనటులు, టెక్నీషియన్స్ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈ ఫస్ట్ గ్లింప్స్‌కు మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో, సినిమాకు కూడా అంత మంచి రెస్పాన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను.

ప్రొడ్యూసర్ కార్తికేయన్ సంతానం మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది తెలుగులో మా మొదటి సినిమా. ఈ సినిమా మాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో పనిచేస్తున్న టెక్నీషియన్స్ అందరితో గతంలో కలిసి పనిచేశాను. ఈ సందర్భంగా సన్నీకి థ్యాంక్స్ చెప్తున్నాను. తన వల్లే నేను తెలుగు సినిమాకు పరిచయం అవుతున్నాను. సుహాస్ గారు ఈ కథ విని వెంటనే ఈ సినిమా చేస్తానని చెప్పారు.  తనికెళ్ల భరణి గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆయన పెర్ఫార్మెన్స్ గురించి మాటల్లో చెప్పలేను. అలాగే నందు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాడు. కరుణాకరన్‌కు కూడా థ్యాంక్యూ. ‘తండేల్’ తర్వాత అలాంటి మరో అద్భుతమైన పాత్ర ఇందులో చేశాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సుహాస్ చాలా హంబుల్ పర్సన్. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. స్టోన్ బెంచ్ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ వేడుకలో సినిమా యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

నటీనటులు: సుహాస్, సంజన కృష్ణమూర్తి, తనికెళ్ల భరణి, నందు, కరుణాకరన్.

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: రాజేంద్ర బాల
నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, వర్తికా జైన్
నిర్మాణ సంస్థలు: స్టోన్ బెంచ్ స్టూడియో, మిస్రిలాల్ పిక్చర్స్
సంగీతం: అమృత్ రామనాథన్
డీవోపీ: కార్తిక్ పళని
ప్రొడక్షన్ డిజైన్: సురేష్ సెల్వరాజన్
స్టంట్స్: జాషువా
ఎడిటింగ్: షఫీక్ మొహమ్మద్ అలీ
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com