ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..

- October 14, 2026 , by Maagulf
ఘోర పడవ ప్రమాదం..14  మంది మృతి..

బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గంగానదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో వైశాలి జిల్లాలోని రఘెపూర్ దియారా ప్రాంతంలో, రాంపూర్ శ్యామ్‌చంద్ గ్రామం సమీపంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

గంగానది అవతల గ్రామంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొని పడవపై తిరిగి తమ ప్రాంతానికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నది మధ్యలోకిరాగానే పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. ఆ సమయంలో పడవలో 15 నుంచి 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 14మంది మరణించగా.. వీరిలో ఎక్కువ మంది 15ఏళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు వైశాలి జిల్లా మెజిస్ట్రేట్ వర్షా సింగ్ తెలిపారు.

ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com