బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- October 15, 2026
మనామా: బహ్రెయిన్‌లో ప్రవాసులు (ఎక్స్‌పాట్రియేట్స్), విజిటర్స్ కు అందించే వైద్య సేవల రుసుములను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తప్పనిసరి ఆరోగ్య బీమా వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త రుసుములను నిర్ణయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వైద్య సేవల వాస్తవ వ్యయం, వాటి నాణ్యణతను పరిగణనలోకి తీసుకుని సవరించిన రుసుములను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బహ్రెయిన్ పార్లమెంట్ ప్రతినిధుల మండలికి సమర్పించిన మెమోరాండంలో ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది.
పార్లమెంటులో ప్రతిపాదన
బహ్రెయిన్‌లోని ప్రవాస కార్మికులు, సందర్శకులకు వైద్య సేవల రుసుములను పెంచాలని కోరుతూ పార్లమెంట్లో అత్యవసర ప్రతిపాదన వచ్చింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం తక్షణమే రుసుములను పెంచే నిర్ణయం తీసుకోకుండా, ప్రతిపాదిత ఆరోగ్య బీమా వ్యవస్థ అమలును ప్రాతిపదికగా చేసుకుని తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. విజిటర్స్ కు ఆరోగ్య బీమా సదుపాయాన్ని విస్తరించేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసే దిశగా సంబంధిత అధికారులు పనిచేస్తున్నారని ప్రభుత్వం వెల్లడించింది. కొత్త విధానంలో సందర్శకులకు తగిన ఆరోగ్య బీమా కవరేజీ అందేలా వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొంది.
వైద్య సేవల నాణ్యతకు ప్రాధాన్యం
ఆరోగ్య సేవలు అందించే సంస్థలు, బీమా కంపెనీల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం ఈ విధానం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా వైద్య సేవల నాణ్యతను కాపాడటంతో పాటు వాటి ఆర్థిక స్థిరత్వాన్ని దీర్ఘకాలం కొనసాగించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







