లైసెన్స్‌ లేని పార్కింగ్‌ లాట్స్‌ మూసివేత

- August 25, 2016 , by Maagulf
లైసెన్స్‌ లేని పార్కింగ్‌ లాట్స్‌ మూసివేత

షార్జాలో కొన్ని పార్కింగ్‌ లాట్స్‌ నేటి నుంచి (గురువారం) మూసివేయనున్నట్లు షార్జా మునిసిపాలిటీ ప్రకటించింది. ప్రైవేట్‌ లాట్స్‌లో తనిఖీల్ని పెంచామనీ, ఈ సందర్భంగా కొన్ని ప్రైవేట్‌ పార్కింగ్‌ లాట్స్‌లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనీ, లైసెన్స్‌ లేకుండా పార్కింగ్‌ లాట్స్‌ నిర్వహిస్తున్నట్లు గురించి, వాటిపై చర్యలు తీసుకుంటున్నామని మునిసిపాలిటీ అధికారులు వెల్లడించారు. ఎమిరేట్‌లో పార్కింగ్‌ ఏరియాస్‌ని రెగ్యులేట్‌ చేసే క్రమంలో ఈ చర్యలు చేపట్టామని వారు తెలిపారు. మునిసిపాలిటీకి చెందిన పబ్లిక్‌ పార్కింగ్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ అతెఫ్‌ అల్‌ జరౌని మాట్లాడుతూ, అక్రమ పార్కింగ్‌ లాట్స్‌ని సంబంధిత శాఖల సమన్వయంతో మూసివేయడం జరుగుతుందని అన్నారు. ఆయా పార్కింగ్‌ లాట్స్‌లో పార్క్‌ చేసిన వాహనదారులకు లీఫ్‌లెట్స్‌ జారీ చేశామనీ, ఇకపై అక్రమ పార్కింగ్‌ లాట్స్‌కి వాహనదారులు సహకరించద్దని కోరామని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com