సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- October 15, 2026
రియాద్: సౌదీ అరేబియాలో తప్పనిసరి ఆరోగ్య బీమా పాలసీ పరిధిలో ఇంటి వద్ద అందించే వైద్య సేవలకు కూడా కవరేజ్ ఉంటుందని కౌన్సిల్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్పష్టం చేసింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా రోగులు ఇంటి వద్దనే అవసరమైన చికిత్సను కొనసాగించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని వెల్లడించింది.
ఏయే సేవలకు బీమా వర్తిస్తుంది?
ఇంటి వద్ద అందించే వైద్య సేవల్లో భాగంగా పలు చికిత్సలకు తప్పనిసరి ఆరోగ్య బీమా వర్తిస్తుందని కౌన్సిల్ తెలిపింది. వీటిలో ముఖ్యంగా మూత్ర విసర్జన కోసం క్యాథెటర్ అమర్చడం వంటి వైద్య సేవలు, శస్త్రచికిత్స అనంతరం సిరల ద్వారా మందులు అందించడం, ఆపరేషన్ తర్వాత గాయాలకు డ్రెస్సింగ్ చేయడం, అవసరమైన సంరక్షణ అందించడం వంటి సేవలు రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత కూడా వైద్యుల సూచనల మేరకు ఇంటి వద్ద చికిత్స కొనసాగించేందుకు సహాయపడతాయి.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం
ఇంటి వద్ద వైద్య సేవలు పొందేందుకు అర్హులైన లబ్ధిదారులు ఎలక్ట్రానిక్ విధానంలో దరఖాస్తు చేసుకునేలా సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సదుపాయం కల్పించింది. దీనివల్ల రోగులు తమ కుటుంబ సభ్యుల మధ్య ఉంటూనే సురక్షితమైన, సమగ్ర వైద్య సంరక్షణ పొందే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంటి వద్ద చికిత్స అందుబాటులో ఉండటం వల్ల రోగులకు సౌకర్యం పెరగడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.
సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఫిజియోథెరపీ, ఇంటి వద్ద పోషకాహార సేవలు, శ్వాస సంబంధిత సంరక్షణ, మందుల నిర్వహణతో పాటు ఇతర అవసరమైన వైద్య సేవలను కూడా వివిధ రకాల రోగులకు అందిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







