విదేశాంగ శాఖ కొత్త ప్రయోగం..
- August 25, 2016
పాస్‌పోర్టు మంజూరు చేయాలంటే ముందుగా పోలీస్ తనిఖీ చాలా కీలకం! పోలీసు అధికారి వచ్చి వివరాలు నమోదు చేసుకుని అన్నీ సవ్యంగా ఉన్నాయని నివేదిక పంపితేగానీ.. పాస్‌పోర్టు చేతికందదు! కానీ ఇకనుంచి ఇంత తతంగం ఉండదు. పోలీస్ తనిఖీలను మరింత సులభం చేసి.. పాస్‌పోర్టును వీలైనంత తొందరగా ఇచ్చేందుకు విదేశాంగ శాఖ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం శుక్రవారం నుంచి అమలుకానుంది. ఇకపై ఎవరైనా పాస్‌పోర్టుకు కొత్తగా దరఖాస్తు చేసుకుంటే.. వారు సమర్పించే డాక్యుమెంట్ల ఆధారంగా అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయితే చాలు!పోలీస్ తనిఖీ పూర్తికాకముందే అంటే దరఖాస్తు పరిశీలన పూర్తయిన రోజే పాస్‌పోర్టు మంజూరు చేస్తారు. అది మూడు రోజుల్లోగా దరఖాస్తుదారుకు చేరుతుంది. ఆ తరువాత పోలీసు నివేదిక ఆధారంగా ఏమైనా తేడాఉంటే షోకాజ్ నోటీసు ఇచ్చి విచారణ చేస్తారు. ఏమేమి ఉండాలంటే.. వెంటనే పాస్‌పోర్టు కావాలనుకునేవారు ఆధార్ కార్డు, ఓటరు కార్డు, ఫొటో గుర్తింపు కార్డు, పాన కార్డుల్లో ఏవైనా మూడింటిని సమర్పించాలి. ఈ మూడింటిలో పేరు, ఇతర వివరాలు అన్నీ ఒకేలా ఉండాలి. అప్పుడే పాస్‌పోర్టును పోలీస్ తనిఖీకి ముందే జారీ చేస్తారని విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ఎనఎల్‌పీ చౌదరి తెలిపారు. ఈ పత్రాలతో పాటు తప్పనిసరిగా పుట్టిన తేదీ ధ్రువపత్రం, నాన ఈసీఆర్ పత్రాలు, అనెక్షర్-1 సమర్పించాలి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







