విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- October 19, 2026
దోహా: పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన తాజా వివరాలు అందుబాటులో ఉండేలా ఖతార్ ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) ఎలక్ట్రానిక్ విద్యార్థుల ఆరోగ్య ప్రకటన ఫారాన్ని ప్రవేశపెట్టింది. తమ పిల్లలకు సంబంధించిన ఈ ఫారాలను పూర్తి చేయాలని తల్లిదండ్రులకు సూచించింది. ఖతార్ విద్యా, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు PHCC సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య అవసరాలను సమర్థంగా గుర్తించి, అవసరమైన సమయంలో తగిన వైద్య సహాయం అందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాఠశాల ఆరోగ్య బృందాలకు అందుబాటులో ఉంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, ఆ సమాచారాన్ని పాఠశాల క్లినిక్‌లో భద్రపరుస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అనధికార వ్యక్తులు ఈ వివరాలను పొందకుండా చట్టపరమైన రక్షణ ఉంటుందని తెలిపింది.
అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులకు సరైన వైద్య సహాయం అందించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్య సమస్యలను ముందుగానే వెల్లడించడం అత్యంత ముఖ్యమని అధికారులు సూచించారు. ఆరోగ్య సమస్యలను తెలియజేయకపోవడం వల్ల అత్యవసర సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..







