ఒమన్‌లో నవంబర్‌లో 4 రోజుల జాతీయ దినోత్సవ సెలవులు..!
- October 23, 2026
మస్కట్: ఒమన్ ప్రభుత్వం 2026 జాతీయ దినోత్సవ సెలవుల తేదీలను ప్రకటించింది. నవంబర్ 25, 26 రెండు రోజుల పాటు జాతీయ దినోత్సవ సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవులకు వారాంతం కూడా కలవడంతో ఉద్యోగులు, నివాసితులకు వరుసగా 4 రోజుల విరామం లభించే అవకాశం ఉంది. కార్మిక మంత్రిత్వ శాఖ (Ministry of Labour) 2026 సంవత్సరానికి సంబంధించిన జాతీయ, మతపరమైన సెలవుల వార్షిక ప్రకటనలో ఈ తేదీలను వెల్లడించింది.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ముందస్తు సమాచారం
ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు తమ పని వేళలు, కార్యక్రమాలను ముందుగానే ప్రణాళిక చేసుకునేందుకు వీలుగా ప్రతి గ్రెగోరియన్ సంవత్సరం ప్రారంభంలోనే అధికారిక సెలవుల తేదీలను ప్రకటించే విధానానికి మంత్రుల మండలి ఆమోదం తెలిపింది.
2026లో ఒమన్‌లో ఇతర సెలవుల తేదీలు
కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాబితా ప్రకారం..
- జనవరి 15, గురువారం: సుల్తాన్ అధికార పగ్గాలు చేపట్టిన రోజు (Accession Day)
- జనవరి 18, ఆదివారం: అల్ ఇస్రా వల్ మిరాజ్
- జూన్ 18, గురువారం: హిజ్రీ నూతన సంవత్సరం
- ఆగస్టు 27, గురువారం: ప్రవక్త మహమ్మద్ జన్మదినం
- నవంబర్ 25, బుధవారం: జాతీయ దినోత్సవ సెలవు
- నవంబర్ 26, గురువారం: జాతీయ దినోత్సవ సెలవు
ఈద్ అల్ ఫితర్, ఈద్ అల్ అధా పండుగల సెలవుల తేదీలను మాత్రం హిజ్రీ నెలల ప్రారంభాన్ని నిర్ణయించే ప్రధాన కమిటీ ప్రకటనల ఆధారంగా వెల్లడించనున్నారు.
ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు
ఒమన్‌లో జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని వివిధ గవర్నరేట్లలో వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశ వారసత్వం, సంస్కృతి, జాతీయ గుర్తింపును ప్రతిబింబించేలా ఈ వేడుకలు జరుగుతాయని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో నవంబర్‌లో 4 రోజుల జాతీయ దినోత్సవ సెలవులు..!
- యూఏఈలో భారీ వర్షాలు.. దుబాయ్ ముందస్తు చర్యలు..!!
- ప్రిస్క్రిప్షన్ల పరిశీలన, మందుల భద్రత ఫార్మసిస్టర్ల బాధ్యతలు..!!
- డెలివరీ బైక్‌లపై కువైట్‌లో ట్రాఫిక్ శాఖ కొరడా..!!
- భారత రాయబారితో భారతి అసోసియేషన్ ప్రతినిధుల భేటీ..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై ఖతార్ ప్రధాని, అమెరికా విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఏపీ సీఎస్ సాయిప్రసాద్ పదవీకాలం పొడిగింపు
- దుబాయ్‌లో ఆన్లైన్ పెట్టుబడుల మోసం.. 30 ఏళ్ల పొదుపు Dh400,000 పైగా స్వాహా!
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రీషెడ్యూల్..
- సౌదీ విమానాశ్రయం, చమురు క్షేత్రంపై హూతీ దాడులు..







