పాకం గారెలు
- August 26, 2016
కావలసిన పదార్ధాలు:
మినపప్పు - అర కేజీ ,
నూనె - పావు కేజీ ,
ఉప్పు - తగినంత ,
పంచదార - పావు కేజీ ,
అల్లం ముక్కలు తరిగినవి - రెండు స్పూన్‌లు ,
జీలకర్ర - ఒక స్పూన్ ,
కొత్తిమీర తురుము- ఒక కప్పు ,
ఉల్లిపాయ - ఒకటి ,
పచ్చి మిర్చి - రెండు
తయారు చేయు విధానం:
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో సరిపడా నీళ్ళు పోసి పంచదార వేసి మరిగించి పాకం తాయారు చేసుకోవాలి.
తరువాత నానపెట్టుకున్న మినపప్పుని కడిగి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మిశ్రమం బాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తరువాత అందులో ఉల్లిపాయలు, అల్లం, పచ్చి మిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి వేడి అయ్యాక చేతిపై గారెల మాదిరిగా వత్తుకుంటూ నూనెలో వేసుకోవాలి.
తరువాత ఆ గారెలను పంచదార పాకంలో వేయాలి. ఈ గారెలను వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









