నవంబర్ 1 నుంచి కొత్త GST నిబంధనలు
- October 27, 2026
న్యూ ఢిల్లీ: దేశంలో వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) నిబంధనలను సులభతరం చేయడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) సయోధ్యను మెరుగుపరచడం, పన్ను రీఫండ్ల ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా జీఎస్టీ కౌన్సిల్ పలు విప్లవాత్మక నిబంధనల పాటింపు సంస్కరణలను సిఫార్సు చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) సభ్యుడు (GST) సంజయ్ మంగళ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంస్కరణలు రెండు దశల్లో అమలు కానున్నాయి. శాసన సవరణలు అవసరం లేని చర్యలు నవంబర్ 1, 2026 నుండి అమల్లోకి రానుండగా, కీలక చట్టపరమైన మార్పులను ఏప్రిల్ 1, 2027 నాటికి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత అక్టోబర్ 8న జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
వ్యాపారాలు తెలుసుకోవాల్సిన ప్రధాన నిర్ణయాలివే...
జీఎస్టీ రిటర్న్ ఫారాల సవరణ (GSTR Reform): దాదాపు 80 శాతం జీఎస్టీ నోటీసులు రిటర్న్‌లలోని డేటా వ్యత్యాసాల (Discrepancies) వల్లనే వస్తున్నాయని సీబీఐసీ తెలిపింది. దీనిని నివారించేందుకు GSTR-1, GSTR-1A మరియు IFF ఫారాలను సవరించనున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం నవంబర్ 1 నుండి నవంబర్ 30 వరకు ఇవి myGov పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. సవరించిన ఈ కొత్త ఫారాలు ఏప్రిల్ 1, 2027 నుండి అమలులోకి వస్తాయి. 2. చిన్న వ్యాపారులకు ‘ARQP’ పథకం & ఆలస్య రుసుము మాఫీ. ఆ తేదీనే అన్నదాతల ఖాతాల్లోకి రూ.6 వేలు జమ..! ఏడాదికి ₹5 కోట్ల వరకు టర్నోవర్ ఉండి, నమోదిత వినియోగదారులకు కాకుండా కేవలం అన్‌రిజిస్టర్డ్ వినియోగదారులకు (B2C) మాత్రమే వ్యాపారం చేసే చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ‘ఆప్షనల్ యాన్యువల్ రిటర్న్ క్వార్టర్లీ పేమెంట్’ (ARQP) పథకాన్ని ఆమోదించారు.
తాజా వార్తలు
- అబుదాబి నుంచి అమృత్‌సర్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు.. గోవాకు తిరిగి సర్వీసులు
- విశాఖలో BRICS క్రీడా మంత్రుల భేటీ.. భారత్ కీలక ప్రతిపాదనలు
- నవంబర్ 1 నుంచి కొత్త GST నిబంధనలు
- పెన్షన్ వ్యవస్థలో ఖతార్‌కు మెరుగైన ర్యాంకింగ్..!!
- సౌదీలో స్పోర్ట్స్ టికెట్ల విక్రయాలకు కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో 2026 మీడియా ఎక్సలెన్స్ విజేతలకు సత్కారం..!!
- డిసెంబర్లో అబుదాబిలో అరుదైన లగ్జరీ కార్ల వేలం..!
- కువైట్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత..!!
- బహ్రెయిన్‌లో గృహ రుణాల పరిమితి పెంపుపై ప్రభుత్వ అభ్యంతరం..!!
- సల్మానియాలో ప్రత్యేక బ్రెస్ట్ హెల్త్ యూనిట్ ప్రారంభం..!







