షార్జాలో మహిళల కోసం ప్రత్యేక టవర్..!!
- October 28, 2026
షార్జా: యూఏఈలోని షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక టవర్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. కల్బా క్లాక్ టవర్‌కు ఎదురుగా, యూనివర్సిటీ ఆఫ్ కల్బా సమీపంలో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో రద్దీని తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అల్ ఖత్ అల్ ముబాషర్ కార్యక్రమంలో మాట్లాడిన షార్జా పాలకుడు.. ఈ టవర్‌కు అనుబంధంగా అందమైన గార్డెన్, తగినన్ని పార్కింగ్ స్థలాలు, వివిధ ఆటలు ఆడుకునేందుకు వీలుగా కప్పుతో కూడిన హాల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వృద్ధులు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలు
ఖోర్‌ఫక్కాన్ రోడ్డుకు సమీపంలో సమగ్ర సంరక్షణ నగరాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా షార్జా పాలకుడు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇందులో పురుషులు, మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వృద్ధుల కోసం రెండు నివాస కేంద్రాలు, ఫిజియోథెరపీ కోసం రెండు భవనాలు, వ్యసనాల నుంచి కోలుకుంటున్న వారి కోసం రెండు కేంద్రాలు, పిల్లల సంరక్షణ కోసం రెండు గృహాలు ఏర్పాటు చేయనున్నారు. మహిళల రక్షణ కేంద్రంతో పాటు కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ప్రాంగణం, సామాజిక కేంద్రం, ఉద్యానవనాలు, మసీదు, 390 పార్కింగ్ స్థలాలు కూడా నిర్మించనున్నారు.
కల్బా బీచ్ అభివృద్ధి పనులు
కల్బాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపైనా షార్జా ప్రభుత్వం దృష్టి సారించింది. 700 మీటర్ల పొడవైన కల్బా బీచ్ అభివృద్ధి పనులు 75 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బీచ్ ప్రాజెక్టులో రెస్టారెంట్లు, కేఫ్‌లు, కియోస్క్‌లు, జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ మార్గం, ఫుట్‌బాల్ మైదానాలు, వాలీబాల్ కోర్టులు, పిల్లల ఆట స్థలాలు ఏర్పాటు చేయనున్నారు.
మహిళలు, వృద్ధులు, పిల్లల సంరక్షణకు అవసరమైన సదుపాయాలను విస్తరించడంతో పాటు, ప్రజలకు మెరుగైన వినోద, పర్యాటక వసతులు కల్పించే దిశగా ఈ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు షార్జా ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు
- రక్షణ రంగంలో సహకారంపై సౌదీ, ఇటలీ చర్చలు..!!
- ఒమన్‌లో ఇద్దరు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- కువైట్‌లో విదేశీ ఇంజినీర్లకు ఊరట..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక టవర్..!!
- పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిపై ఖతార్ ఫోకస్..!!
- భారీ వర్షాలకు సిద్ధమవుతోన్న బహ్రెయిన్..!!
- నవంబర్ 1 నుంచి దుబాయ్‌లో వైల్డ్ వాడీ వాటర్‌పార్క్ ప్రారంభం..
- ఆసియా పారా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ బలవన్మరణం
- కలలకు ఊపిరి పోయండి...మత్తుకు కాదు 2029 లోగానే నషా ముక్త్ తెలంగాణే లక్ష్యం
- విజయం పై నెతన్యాహు ధీమా వ్యక్తం







