ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. వాహనదారులకు హెచ్చరిక..!!
- October 30, 2026
కువైట్: కువైట్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో దుమ్ము కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవచ్చని తెలిపారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ దర్రార్ అల్-అలీ సూచించారు.
దేశంలో వాతావరణ పరిస్థితులు మారాయని వెల్లడించారు. ఉత్తర సరిహద్దుల సమీపంలో వీచిన గాలులతో దుమ్ము వ్యాపించిందని, దీంతో కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ తగ్గిందని పేర్కొన్నారు.వర్షాలు, దుమ్ము కారణంగా ముఖ్యంగా హైవేలపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బలమైన గాలుల వల్ల సముద్రంలో అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున సముద్రంలోకి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
దుమ్ము, అధిక తేమతో కూడిన వాతావరణం కారణంగా ఆస్తమా, అలర్జీలతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారి సూచించారు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని, గాలిలోని దుమ్ము నుంచి రక్షణ పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- ఖతార్ బెలూన్ ఫెస్టివల్ వాయిదా..!!
- కెనడా వీసా అపాయింట్మెంట్లపై VFS గ్లోబల్ హెచ్చరిక..!!
- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. వాహనదారులకు హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో కార్మికులకు లైసెన్స్డ్ వసతి తప్పనిసరి..!!
- జీసీసీ దేశాల ఐక్యతకు సైనికాధిపతుల పిలుపు..!!
- ఒమన్ లో మానవ అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక చర్యలు..!!
- నిద్రమత్తులో ట్రక్కు డ్రైవింగ్.. E611 రోడ్డు పై ప్రమాదం
- సూడాన్ సైన్యానికి ఆయుధాల సరఫరా కేసు.. 8 మందికి జీవిత ఖైదు
- ప్రజలకు పోలీసు సేవలను చేరవేయడమే ‘సురక్ష’ లక్ష్యం: డిజిపి సి.వి. ఆనంద్
- సంస్కృతి సమాజాలను కలిపే వారధి: గవర్నర్ శివప్రతాప్ శుక్లా







