ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. వాహనదారులకు హెచ్చరిక..!!

- October 30, 2026 , by Maagulf
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. వాహనదారులకు హెచ్చరిక..!!

కువైట్: కువైట్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో దుమ్ము కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవచ్చని తెలిపారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని  వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ దర్రార్ అల్-అలీ సూచించారు.

దేశంలో వాతావరణ పరిస్థితులు మారాయని వెల్లడించారు. ఉత్తర సరిహద్దుల సమీపంలో వీచిన గాలులతో దుమ్ము వ్యాపించిందని, దీంతో కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ తగ్గిందని పేర్కొన్నారు.వర్షాలు, దుమ్ము కారణంగా ముఖ్యంగా హైవేలపై ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బలమైన గాలుల వల్ల సముద్రంలో అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున సముద్రంలోకి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
దుమ్ము, అధిక తేమతో కూడిన వాతావరణం కారణంగా ఆస్తమా, అలర్జీలతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారి సూచించారు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని, గాలిలోని దుమ్ము నుంచి రక్షణ పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com