ఖతార్ బెలూన్ ఫెస్టివల్ వాయిదా..!!
- October 30, 2026
దోహా: ఖతార్‌లో నిర్వహించనున్న 7వ ఎడిషన్ బెలూన్ ఫెస్టివల్ వాయిదా పడింది. ఈ విషయాన్ని ఫెస్టివల్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాస్తవానికి ఈ వేడుకలు డిసెంబర్ 10–19 మధ్య జరగాల్సి ఉంది. అయితే, అనివార్య కారణాలతో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కొత్త తేదీలను ఇంకా ఖరారు చేయలేదని, అవి నిర్ధారణ కాగానే వెల్లడిస్తామని తెలిపారు.
విజిటర్స్ ఆశించే స్థాయిలో నాణ్యమైన కార్యక్రమాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ బెలూన్ పైలట్లు ఇప్పటికే సమర్పించిన దరఖాస్తులన్నీ చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేశారు. కొత్త తేదీలకు సంబంధించి దరఖాస్తుదారులకు నేరుగా సమాచారం అందిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ బెలూన్ ఫెస్టివల్ వాయిదా..!!
- కెనడా వీసా అపాయింట్మెంట్లపై VFS గ్లోబల్ హెచ్చరిక..!!
- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. వాహనదారులకు హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో కార్మికులకు లైసెన్స్డ్ వసతి తప్పనిసరి..!!
- జీసీసీ దేశాల ఐక్యతకు సైనికాధిపతుల పిలుపు..!!
- ఒమన్ లో మానవ అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక చర్యలు..!!
- నిద్రమత్తులో ట్రక్కు డ్రైవింగ్.. E611 రోడ్డు పై ప్రమాదం
- సూడాన్ సైన్యానికి ఆయుధాల సరఫరా కేసు.. 8 మందికి జీవిత ఖైదు
- ప్రజలకు పోలీసు సేవలను చేరవేయడమే ‘సురక్ష’ లక్ష్యం: డిజిపి సి.వి. ఆనంద్
- సంస్కృతి సమాజాలను కలిపే వారధి: గవర్నర్ శివప్రతాప్ శుక్లా







