అపార్ట్మెంట్ ఐదు అంతస్తులో అగ్ని ప్రమాదం

- August 27, 2016 , by Maagulf
అపార్ట్మెంట్ ఐదు అంతస్తులో అగ్ని ప్రమాదం

షార్జ: స్థానిక కల్బా ప్రాంతంలో శుక్రవారం రాత్రి అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరగ్గా  ఒక కుటుంబం  మంటలలో చిక్కుకుపోవడంతో ఎంతో శ్రమతో  రక్షించాల్సి వచ్చింది .షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్  లెఫ్టినెంట్ కల్నల్ సామి అల్ నాక్బి ఈ అగ్ని ప్రమాదం గూర్చి మాట్లాడుతూ,  ఐదు అంతస్తుల భవనంలో  పై అంతస్థులో  శుక్రవారం రాత్రి  9.05 గంటల సమయంలో  బయటపడిన మంటలకు  అక్కడ ఉన్న నివాసితులని తక్షణమే ఖాళీ చేయించినట్లు ఆయన చెప్పారు.

కల్బా మరియు ఫుజైరః  నుండి అగ్నిమాపక సిబ్బంది అగ్నితో పోరాటం చేసి మంటలను అదుపు చేశారు. 
ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికీ గాయాలు కాలేదని వారు నివేదించారు. పోలీసులు ప్రస్తుతం అగ్నిప్రమాదంపై  కారణాన్ని  పరిశోధిస్తున్నారు.
          

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com