కొత్త మెర్సిడెస్ బెంజ్ కారుని టెస్ట్ డ్రైవ్ చేయబోయి మహిళ విధ్వంసం
- August 27, 2016
ఎందుకు ...ఏమిటీ ...ఎలా...అని పరిశోధించకుండా " అదంతే " అనుకోవడంలో ఎంతో తృప్తి ఉంది... ఈ సూత్రానికి విరుద్ధంగా ఒక మహిళ సరదాగా టెస్ట్ డ్రైవ్ కోసం అర్లింగ్టన్ వద్ద ఒక తెలుపు మెర్సిడెస్ బెంజ్ ఎస్ యు వి కారుని తీసుకొని నడపబోయింది. అంతే... రెప్పపాటులో ఆ కొత్త కారు వింత వింత ఒంపులు తిరుగుతూ వివిధ విన్యాసాలు చేస్తూ బోర్లా తిరిగి మరలా నుంచొని పలు వాహనాల్ని " ఢీ " కొడ్తూ నేలపై జర్రుమని ...జారుకొంటూ టపీమని పడిపోయింది. ధగ ధగ లాడే కారు క్షణాలలో బోలెడు సొట్టలతో మారిపోవడంతో సంబంధిత కార్ల విక్రయదారుడు ఏడవలేక లబ లబలాడుతూ ఎందుకు తల్లీ ఈ విన్యాసాలు చేసావని ? ఆ మహిళని ప్రశ్నస్తే... ఏదో గ్యాస్ బ్రేక్ పెడల్ పై కాలుతో అదుముదామని అనుకొన్నా...కానీ , యాక్సిలేటర్ మీద బలంగా కాలితో నొక్కానంతే...ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు " సారీ " అని జవాబు ఇచ్చింది...ఆమె " ఢీ " కొట్టిన కార్లలో ఆమె స్వంత కారు ఎస్యూవీ సైతం ఉంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









