అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి విరుచుకుపడ్డారు

- August 27, 2016 , by Maagulf
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి విరుచుకుపడ్డారు


 

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి విరుచుకుపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి తూర్పు అఫ్గానిస్థాన్‌ ప్రాంతంలో జానీఖేల్‌ జిల్లాలో తాలిబన్లు ఒక్కసారిగా దాడి నిర్వహించి భద్రతా బలగాలను తరిమికొట్టారు. ఈ దాడిలో భారీ సంఖ్యలో పోలీసులు, సైనికులు మృతి చెందడంగానీ గాయపడటంగానీ జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పక్తియా గవర్నర్‌ అబ్దుల్‌ రహమాన్‌ సోలామల్‌ తెలిపారు. దీంతో పక్తియా ప్రాంతాన్ని ఎనిమిది జిల్లాలతో కలిపే కీలకమైన రహదారి తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. మా జిల్లాను తాలిబన్లు ఐదురోజులుగా చుట్టుముట్టారు. వారు అర్థరాత్రిళ్లు చెక్‌పోస్టులపై దాడులు నిర్వహిస్తురని ఆయన చెప్పారు.

వెంటనే ఆ హైవేను స్వాధీనం చేసుకోకపోతే వారు వరుసుగా ఆక్రమించుకుంటూ పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com