ఏఎఫ్సీ ఆసియా కప్ 2027 షెడ్యూల్లో మార్పు..!!
- November 03, 2026
కౌలాలంపూర్: ఆసియా ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏఎఫ్సీ ఆసియా కప్ సౌదీ అరేబియా 2027 టోర్నమెంట్ షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. ఈ టోర్నీని 2027 డిసెంబర్ 23 నుంచి 2028 జనవరి 21 వరకు నిర్వహించనున్నట్లు ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) ప్రకటించింది. తొలుత ఈ పోటీలు 2027 జనవరి 7 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరగాల్సి ఉంది. టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన స్థానిక కమిటీ (ఎల్ఓసీ), సౌదీ అరేబియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఎస్ఏఎఫ్ఎఫ్)తో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఎఫ్సీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
ఆసియాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జాతీయ ఫుట్‌బాల్ జట్ల టోర్నమెంట్ అయిన ఆసియా కప్ వేదికలో ఎలాంటి మార్పు లేదని, సౌదీ అరేబియాలోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. కొత్త షెడ్యూల్‌కు అనుగుణంగా ఏర్పాట్లను కొనసాగిస్తామని స్థానిక నిర్వహణ కమిటీ తెలిపింది. ఏఎఫ్సీతో పాటు సంబంధిత భాగస్వామ్య సంస్థలతో సమన్వయం చేసుకుంటూ టోర్నీ విజయవంతానికి కృషి చేస్తామని పేర్కొంది.
ఆసియా ఫుట్‌బాల్ అభిమానుల అంచనాలకు అనుగుణంగా, సౌదీ అరేబియా ప్రతిష్ఠను ప్రతిబింబించేలా ఈసారి ఆసియా కప్‌ను అత్యుత్తమంగా నిర్వహించడమే లక్ష్యమని ఏఎఫ్సీ వెల్లడించింది.
తాజా వార్తలు
- QRCS షెల్టర్ ప్రాజెక్టు.. 704 కుటుంబాలకు లబ్ధి..!!
- ఒమన్ – బ్రూనై మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!
- యూఏఈలో భారతీయ పాఠశాలల్లో దీపావళి సందడి..!!
- కువైట్‌లో ముగ్గురు ప్రవాసులకు మూడేళ్ల జైలు, బహిష్కరణ వేటు..!!
- ఏఎఫ్సీ ఆసియా కప్ 2027 షెడ్యూల్లో మార్పు..!!
- గల్ఫ్ డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలక ముందడుగు..!
- ఖతార్‌లో క్లాస్జెన్ ఐ డ్రాప్స్ రీకాల్..!!
- బహ్రెయిన్ పాఠశాలల్లో పర్యావరణ పాఠాలు..!!
- యూఏఈలో వాహనాల కొనుగోలుపై కొత్త నిబంధనలు..!!
- భారత్ నుంచి పేపర్ దిగుమతులపై GCC యాంటీ డంపింగ్ విచారణ..!!







