ఖతార్‌కు తొలి 10 నెలల్లో పోటెత్తిన పర్యాటకులు..!!
- November 04, 2026
దోహా: 2026 ఏడాది తొలి 10 నెలల్లో ఖతార్‌కు వివిధ దేశాల నుంచి 2.95 మిలియన్ల మంది పర్యాటకులు వచ్చినట్లు ఖతార్ టూరిజం వెల్లడించింది. భూమి, విమాన, సముద్ర మార్గాల ద్వారా వీరు ఖతార్‌కు చేరుకున్నట్లు తెలిపింది.
అక్టోబర్ నెలలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సెప్టెంబర్‌లో 276,000 మంది రాగా, అక్టోబర్‌లో 336,000 మంది సందర్శించారు. దీంతో సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో పర్యాటకుల సంఖ్య 21.7 శాతం పెరిగింది.
జనవరి నుంచి అక్టోబర్ వరకు వచ్చిన పర్యాటకుల్లో గల్ఫ్ దేశాల (జీసీసీ) వాటా అత్యధికంగా ఉంది. ఈ దేశాల నుంచి 1.176 మిలియన్ల మంది (39.9 శాతం) ఖతార్‌ను సందర్శించారు. ఆసియా, ఓషియానియా దేశాల నుంచి 630,000 లక్షల మంది (21.4 శాతం) రాగా, యూరప్ దేశాల నుంచి 620,000 మంది (21 శాతం) వచ్చారు.
ఇక అమెరికా ఖండాల నుంచి 216,000 మంది (7.3 శాతం), ఇతర అరబ్ దేశాల నుంచి 209,000 లక్షల మంది (7.1 శాతం) ఖతార్‌ను సందర్శించారు. ఇతర ఆఫ్రికా దేశాల నుంచి 96 వేల మంది (3.3 శాతం) పర్యాటకులు వచ్చినట్లు ఖతార్ టూరిజం గణాంకాలు వెల్లడించాయి. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న సందర్శకులే ఖతార్ పర్యాటక రంగానికి ప్రధాన బలంగా నిలుస్తుండగా, ఆసియా, యూరప్ దేశాల నుంచి కూడా గణనీయమైన సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే గట్టిగా బదులిస్తాం..!!
- ఖతార్‌కు తొలి 10 నెలల్లో పోటెత్తిన పర్యాటకులు..!!
- ఒమన్‌లో ఎస్ఎంఈల అభివృద్ధికి మరో ముందడుగు..!!
- దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్‌లో దీపావళి వేడుకలు..
- దుబాయ్‌లో ప్రపంచంలోనే తొలి సిటీ వైడ్ టూరిజం లాయల్టీ ప్రోగ్రామ్ ప్రారంభం
- చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్..జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!
- అర్ధరాత్రి 2.30 వరకు షోలు..చిత్రసీమ కు CM విజయ్ గుడ్ న్యూస్
- మిడ్ టర్మ్ ఎన్నికలు.. అమెరికాలో మొదలైన పోలింగ్
- సైబర్ నేరాల కట్టడికి రాష్ట్రాల మధ్య సమన్వయం కీలకం: డీజీపీ సీవీ ఆనంద్







