రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ
- November 09, 2026
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ‘శత్రు వైమానిక ముప్పు’ పొంచి ఉందంటూ అధికారులు ప్రజలకు అత్యవసర హెచ్చరిక సందేశం పంపించారు. అయితే కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.
రియాద్‌లో నివసిస్తున్న ప్రజల మొబైల్ ఫోన్లకు సౌదీ అధికారులు టెక్స్ట్ అలర్ట్ పంపించారు. అందులో.. “హెచ్చరిక.. ఈ ప్రాంతంలో శత్రు వైమానిక ముప్పు ఉంది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. ఇళ్లలోనే లేదా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. కిటికీలు, తలుపులకు దూరంగా ఉండాలి. పౌర రక్షణ శాఖ (Civil Defence) సూచనలను తప్పనిసరిగా పాటించాలి” అని పేర్కొన్నారు.
అయితే ఈ హెచ్చరిక జారీ చేసిన కొన్ని నిమిషాలకే అధికారులు అలర్ట్‌ను ఎత్తివేశారు. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఘటనతో రియాద్‌లో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక మార్గదర్శకాలను పాటించాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ
- ఒమన్‌లో కొత్త పర్యాటక ప్రాజెక్టు ‘అల్ యజాన్’..!!
- సౌదీ–అమెరికా మధ్య వాణిజ్యం పెంపునకు కొత్త ప్రణాళికలు..!!
- ఖతార్‌లో ఘనంగా ప్రారంభమైన MWC26 దోహా..!!
- అరబ్ దేశాల ఐక్యత మరింత బలోపేతం కావాలి: హమద్
- కువైట్‌లో 13 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- యూఏఈ పాఠశాలల్లో కఠినమైన సైబర్ భద్రతా నిబంధనలు..!!
- దీపావళి వేళ ఘోర అగ్నిప్రమాదాలు.. మూడు ఘటనల్లో 18 మంది సజీవదహనం!
- వాహనదారులకు తెలంగాణ RTA గుడ్ న్యూస్
- టపాసులతో 48 మందికి కంటికి గాయాలు!







