ఖోర్ ఫక్కాన్‌లో ఆయిల్ మరకలు.. అల్ లులూయా బీచ్ తాత్కాలికంగా మూసివేత

- November 09, 2026 , by Maagulf
ఖోర్ ఫక్కాన్‌లో ఆయిల్ మరకలు.. అల్ లులూయా బీచ్ తాత్కాలికంగా మూసివేత

యూఏఈ: షార్జా ఎమిరేట్‌లోని ఖోర్ ఫక్కాన్‌లో అల్ లులూయా బీచ్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. బీచ్ తీర ప్రాంతంలో సముద్రపు నీటిపై చమురు మరకలు (Oil Slicks) గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

బీచ్‌కు వచ్చే సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

బీచ్ తిరిగి తెరిచే వరకు ప్రజలు అక్కడికి వెళ్లకుండా సహకరించాలని, అధికారులు జారీ చేసే భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com