దుబాయ్‌లో మరో కీలక పెడెస్ట్రియన్ బ్రిడ్జి..
- November 09, 2026
గంటకు 10 వేల మంది ప్రయాణించే సామర్థ్యం.. పాదచారుల భద్రతకు పెద్దపీట
దుబాయ్: నగరంలో పాదచారుల రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA), దుబాయ్ హోల్డింగ్ రియల్ ఎస్టేట్‌లో భాగమైన మెరాస్ కీలక ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురానున్నాయి.
110 మీటర్ల పొడవైన కొత్త పాదచారుల వంతెనను మంగళవారం ప్రారంభించనున్నాయి. ఈ వంతెన బుర్జ్ ఖలీఫా/దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్‌ను సిటీ వాక్‌లోని కోకాకోలా అరేనాతో అనుసంధానిస్తుంది.
ఈ వంతెన ద్వారా మెట్రో స్టేషన్ నుంచి కోకాకోలా అరేనాకు పాదచారులు మరింత సులభంగా, సురక్షితంగా చేరుకోవచ్చు. ముఖ్యంగా కోకాకోలా అరేనాలో జరిగే భారీ కార్యక్రమాలు, సంగీత కచేరీలు, ఇతర ఈవెంట్ల సమయంలో సందర్శకులకు ఈ వంతెన ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
ఈ వంతెన గంటకు సుమారు 10,000 మంది పాదచారులు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒక కార్యక్రమానికి సంబంధించిన మొత్తం ప్రేక్షకుల సామర్థ్యంలో ఇది సుమారు 59 శాతానికి సమానమని అధికారులు వెల్లడించారు.
దుబాయ్‌లో పాదచారుల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు రద్దీని నియంత్రించడం, ప్రయాణికుల భద్రతను పెంపొందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మరో కీలక పెడెస్ట్రియన్ బ్రిడ్జి..
- ఇరాన్‌కు ఆయుధాల సరఫరాను అడ్డుకోవడమే అమెరికా వ్యూహం!
- ఖోర్ ఫక్కాన్‌లో ఆయిల్ మరకలు.. అల్ లులూయా బీచ్ తాత్కాలికంగా మూసివేత
- లడఖ్‌లో ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్
- రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ
- ఒమన్‌లో కొత్త పర్యాటక ప్రాజెక్టు ‘అల్ యజాన్’..!!
- సౌదీ–అమెరికా మధ్య వాణిజ్యం పెంపునకు కొత్త ప్రణాళికలు..!!
- ఖతార్‌లో ఘనంగా ప్రారంభమైన MWC26 దోహా..!!
- అరబ్ దేశాల ఐక్యత మరింత బలోపేతం కావాలి: హమద్
- కువైట్‌లో 13 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!







