సౌదీ అరామ్కో భవనాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎమిర్..!!
- November 10, 2026
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో హౌతీ దాడికి గురైన సౌదీ అరామ్కో (Saudi Aramco) పరిపాలనా భవనాన్ని రియాద్ ప్రాంత డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ సందర్శించి పరిశీలించారు. దాడి కారణంగా భవనానికి జరిగిన స్వల్ప నష్టాన్ని ఆయన సమీక్షించారు.
ఆదివారం ఉదయం భవనాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడికి ప్రయత్నం జరిగింది. ఈ ఘటనలో డ్రోన్ శకలాలు భవన ప్రాంగణంలో పడటంతో కొంతమేర నష్టం వాటిల్లింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని సౌదీ ఇంధన మంత్రిత్వశాఖ వెల్లడించింది. సంఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
ప్రిన్స్ మహమ్మద్ మాట్లాడుతూ.. పౌర సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటున్న హౌతీల దాడులు ఆ సంస్థ పట్ల సౌదీ అరేబియా గతంలో వ్యక్తం చేసిన వైఖరిని మరింత బలపరుస్తున్నాయని పేర్కొన్నారు. దాడి అనంతరం పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంలో పౌర, సైనిక, భద్రతా విభాగాల సిబ్బంది చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం వారు అందిస్తున్న సేవలను కొనియాడారు. జాతీయ ఐక్యతతో పాటు దేశ భద్రతకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సౌదీ భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరామ్కో భవనాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎమిర్..!!
- ఖతార్‌లో ప్రైవేట్ స్కూల్స్, కిండర్గార్టెన్లకు కొత్త మార్గదర్శకాలు..!!
- COP31 సదస్సులో ఒమన్..2050 నాటికి నెట్‌జీరోకు కృషి..!!
- కువైట్‌లో వాహనదారులకు ట్రాఫిక్ సేవలు మరింత సులభతరం..!!
- బహ్రెయిన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కౌన్సిల్ కీలక నిర్ణయం..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు.. మార్పులివే..!!
- కన్ఫామ్ టికెట్ లేకుంటే వందే భారత్ ఎక్కలేరు
- తాజా ప్రాంతీయ పరిస్థితులపై సౌదీ, ఒమన్ చర్చలు..!!
- హమద్ విమానాశ్రయంలో ఉచితంగా షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన..!!
- కువైట్ లో టెలికమ్యూనికేషన్ సేవలు ఆధునికీకరణ..!!







