'కింగ్‌' నాగార్జున పోస్టల్‌ స్టాంప్‌ విడుదల

- August 28, 2016 , by Maagulf
'కింగ్‌' నాగార్జున పోస్టల్‌ స్టాంప్‌ విడుదల

మన్మథుడి'గా ఎందరో అమ్మాయిల మనసులు దోచుకున్న 'కింగ్‌'.. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' లాంటి భక్తిరస చిత్రాలతో తనలోని విభిన్నమైన కోణాన్ని చూపించాడు. రేపు కింగ్‌ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన అద్భుతమైన చిత్రాలన్నింటితో కలిపి పోస్టల్‌ స్టాంపును సోమవారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక ఫొటోను విడుదల చేశారు. ప్రేమకు ప్రతిరూపమైన తాజ్‌మహల్‌, దాని పక్కన కింగ్‌ నాగార్జున ఫొటో ఉన్న పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం నాగార్జున ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్న ఓం నమోః వెంకటేశాయ చిత్రంలో విశిష్ట భక్తుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ఈ చిత్రంలోని నాగార్జున పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com