యూఏఈ ప్రాదేశిక జలాల్లో నౌకపై దాడి.. దెబ్బతిన్న ADNOC నౌక

- November 10, 2026 , by Maagulf
యూఏఈ ప్రాదేశిక జలాల్లో నౌకపై దాడి.. దెబ్బతిన్న ADNOC నౌక

అబుదాబి: యూఏఈ ప్రాదేశిక జలాల్లోని అరేబియన్ గల్ఫ్‌లో ADNOC లాజిస్టిక్స్ అండ్ సర్వీసెస్‌కు చెందిన ఓ నౌక పై దాడి జరిగింది. ఈ ఘటనలో నౌక దెబ్బతిన్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది.

నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం ఈ దాడి జరిగినట్లు ADNOC లాజిస్టిక్స్ అండ్ సర్వీసెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఘటన అనంతరం సంబంధిత బృందాలు సహాయక, స్పందన చర్యలు చేపట్టాయని పేర్కొంది.

ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని సంస్థ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ప్రజలు సమాచారం కోసం అధికారిక వనరులపైనే ఆధారపడాలని, ధృవీకరించని వార్తలు, పుకార్లను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com