హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ తో మాగల్ఫ్ ముఖాముఖీ

- November 10, 2026 , by Maagulf
హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ తో మాగల్ఫ్ ముఖాముఖీ

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఉన్న చిత్రాలను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ బ్యానర్‌ పై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘DNK’. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ విలేకరుల సమావేశంలో సినిమా  విశేషాలు పంచుకున్నారు.

‘దొంగ నా కొడకా’ అనే టైటిల్‌కు సెన్సార్ ప్రాబ్లమ్ వస్తుందని ముందే ఊహించి ‘DNK’గా మార్చారా?
-నిజానికి ఈ టైటిల్ విన్నప్పుడు కథకు చాలా పర్ఫెక్ట్‌గా అనిపించింది. అయితే సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పారు. దాంతో ‘DNK’గా మార్చాం.

-రవితేజ గారు మా ట్రైలర్‌ను లాంచ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో టూర్ చేశాం. అక్కడ ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ కథను ఓకే చేయడానికి కారణం ఏమిటి?
-ఇది మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సబ్జెక్ట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు. ఇందులో క్రైమ్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ అది కూడా చాలా ఫన్‌గా ఉంటుంది.

మీరు ప్రొడక్షన్‌లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సినిమా కాస్ట్ కూడా తగ్గిందని నిర్మాత రవి చెప్పారు. దీనిపై మీరేమంటారు?
-అది ఆయన మంచితనం. నిజానికి మేమందరం మంచి టీమ్‌వర్క్‌తో ఈ సినిమా చేశాం. మైత్రీ అనిల్ తో కలిసి పనిచేశాము. ప్రొడక్షన్ గురించి నేర్చుకుందామనే ఉద్దేశంతోనే ఇందులో ఇన్వాల్వ్ అయ్యాను. అనిల్ విషయాలన్నీ చూసుకున్నారు. నేను కేవలం నేర్చుకోవడానికి మాత్రమే ఇన్వాల్వ్ అయ్యాను.

-నిజానికి ప్రొడక్షన్ చేయడానికి కూడా చాలా స్కిల్ ఉండాలి. ఇక్కడ నాకు అలాంటి అవకాశం వచ్చింది కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నించాను.  

‘DNK’ కథలో ఉండే ప్రధాన అంశం ఏమిటి?
-ఈ కథలో ఒక కుర్రాడు ఈజీ మనీకి అలవాటు పడతాడు. గ్యాంబ్లింగ్ చేస్తే డబ్బులు వస్తాయని ఆ మార్గాన్ని ఎంచుకుంటాడు. కానీ అతను తీసుకునే నిర్ణయాల వల్ల అప్పుల్లో కూరుకుపోతాడు. ఆ అప్పుల నుంచి బయటపడటానికి ఒక దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఎలాంటి కష్టాల్లో చిక్కుకున్నాడు? అనేదే ఈ సినిమా కథ.

ఆలీ తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
-ఆలీ తో కలిసి నటించడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఆయనతో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన ఉండటం వల్ల ఆ పాత్రకు మరింత ప్లస్ అయింది. ఇప్పటి వరకు ఆయన ఎక్కువగా ఫాదర్ రోల్స్ చేయలేదు. ఈ సినిమాలో ఆయనకు సంబంధించిన సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి.

సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి? మ్యూజిక్ గురించి చెప్పండి?
-సినిమా అంతా చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ట్విస్టులు కూడా ఉంటాయి. సింజిత్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాటలను థియేటర్లలో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది.

ఈ సినిమాలో డాన్స్ కూడా చేశారు. మీకు ముందుగా డాన్స్ అలవాటు ఉందా?
నాకు ఇంతకుముందు డాన్స్ అలవాటు లేదు. కానీ సందీప్ మాస్టర్ చాలా సపోర్ట్ చేసి నేర్పించారు. ఈ సినిమాలో ఒక డాన్స్ నంబర్ చేయించారు. అది చాలా అద్భుతంగా వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

బబ్లూ క్యారెక్టర్ గురించి చెప్పండి?
బబ్లూ క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ పాత్ర వైజాగ్‌కు చెందినది. కథ కూడా వైజాగ్‌లోనే జరుగుతుంది కాబట్టి ఆ అంశం మాకు మరింత హెల్ప్ అయింది.

భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?
దర్శకత్వం అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. నాకు డైరెక్షన్ చేయాలని ఆసక్తి ఉంది. కాకపోతే అది ఇప్పుడే కాదు. అందుకు ఇంకా చాలా సమయం పడుతుంది.

భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు?
నాకైతే కొత్త కథలు, ఎంటర్‌టైనింగ్ సినిమాలు చేయాలని ఉంది. కొన్ని కథలు విన్నాను. వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com