'దువ్వాడ జగన్నాథమ్'గా అల్లు అర్జున్
- August 28, 2016
'సరైనోడు'గా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్(డీజే)గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర లోగోను చిత్ర బృందం ఆదివారం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టైటిట్ అదిరింది.. డీజే రాకింగ్.. అంటూ దేవీశ్రీ ప్రసాద్ బన్నీకి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ రేపటినుంచి ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత బన్నీతో చిత్రం చేయబోతున్నాను.. దర్శకుడు హరీశ్ అర్జున్ ఇమేజ్ తగిన స్క్రిప్టును సిద్ధం చేసినట్లు తెలిపారు. దిల్ రాజు, బన్నీ కాంబినేషనల్లో వచ్చిన 'ఆర్య', 'పరుగు' చిత్రాలు మంచి హిట్ సాధించాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









