ప్రధానిని కలిసిన సింధు, సాక్షి మాలిక్
- August 28, 2016
రియో ఒలింపిక్స్ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్‌తో పాటు బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, జిమ్నాస్ట్ దీపా కర్మకార్, ఇతర క్రీడాకారులు.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆదివారం ప్రధాని మోదీ అధికార నివాసానికి వీరు వెళ్లారు. మోదీ ఈ సందర్భంగా సింధు, సాక్షి, గోపీచంద్, దీపలను ప్రత్యేకంగా అభినందించారు. సింధు, సాక్షి, దీపలతో ఇటీవల జాతీయ అవార్డులకు ఎంపికైన క్రీడాకారులను మోదీ సత్కరించారు.
రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం సింధు రజతం, రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. సింధుకు కోచ్‌గా గోపీచంద్ వ్యవహరించాడు. జిమ్నాస్ట్ దీపా కర్మకార్ రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







