ప్రధానిని కలిసిన సింధు, సాక్షి మాలిక్

- August 28, 2016 , by Maagulf
ప్రధానిని కలిసిన సింధు, సాక్షి మాలిక్

రియో ఒలింపిక్స్ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్తో పాటు బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, జిమ్నాస్ట్ దీపా కర్మకార్, ఇతర క్రీడాకారులు.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆదివారం ప్రధాని మోదీ అధికార నివాసానికి వీరు వెళ్లారు. మోదీ ఈ సందర్భంగా సింధు, సాక్షి, గోపీచంద్, దీపలను ప్రత్యేకంగా అభినందించారు. సింధు, సాక్షి, దీపలతో ఇటీవల జాతీయ అవార్డులకు ఎంపికైన క్రీడాకారులను మోదీ సత్కరించారు.

రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో తెలుగుతేజం సింధు రజతం, రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. సింధుకు కోచ్గా గోపీచంద్ వ్యవహరించాడు. జిమ్నాస్ట్ దీపా కర్మకార్‌ రియో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శన చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com