ఓట్స్ ఉప్మా
- August 28, 2016
కావాల్సిన పదార్ధాలు: రెండు కప్పులు ఓట్స్, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, రెండు టీ స్పూన్లు శనగపప్పు, ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు. కరివేపాకు, చిటికెడు ఇంగువ, ఒక టీ స్పూన్ ఆవాలు, మూడు పచ్చిమిరపకాయలు, రెండు ఎండు మిరప కాయలు, ఒక ఉల్లిపాయ, ఒక టీస్పూన్ నూనె, నాలుగున్నర కప్పులు నీరు, తగినంత ఉప్పు.
తయారు చేసే పద్ధతి: పాన్ లో మూడు నిమిషాలపాటు ఓట్స్ వేయించి పక్కన పెట్టుకోండి. పాన్ లో అతి కొద్ది నూనె వేడిచేసి, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండు మిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఉల్లి, అల్లంముక్కలు, కరివేపాకు కూడా వేయాలి. ఉల్లిపాయలు వేగాక ఇంగువ, ఉప్పు కలిపి నీరు పోసి మరిగించాలి. ఓట్స్ వేసి, నీరంతా పీల్చేదాకా సన్నని సెగపై ఉడికించాలి. ఇక మీరు కోరే రుచికర ఓట్స్ ఉప్మా రెడీ. డయాబెటిక్స్ కు ఇది మంచి ఆహారం
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









