రియో ఒలింపిక్స్ పతక విజేతలు మోదీని కలిశారు..
- August 28, 2016
రియో ఒలింపిక్స్ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్ తో పాటు బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, జిమ్నాస్ట్ దీపా కర్మకార్, ఇతర క్రీడాకారులు.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆదివారం ప్రధాని మోదీ అధికార నివాసానికి వీరు వెళ్లారు. మోదీ ఈ సందర్భంగా సింధు, సాక్షి, గోపీచంద్, దీపలను ప్రత్యేకంగా అభినందించారు. సింధు, సాక్షి, దీపలతో ఇటీవల జాతీయ అవార్డులకు ఎంపికైన క్రీడాకారులను మోదీ సత్కరించారు.రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో తెలుగుతేజం సింధు రజతం, రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. సింధుకు కోచ్ గా గోపీచంద్ వ్యవహరించాడు. జిమ్నాస్ట్ దీపా కర్మకార్ రియో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







