'ఓం నమో వెంకటేశాయ' ఫస్ట్‌లుక్‌ను విడుదల..
- August 28, 2016
భక్తిరస చిత్రాలకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పెట్టింది పేరు. తాజాగా అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషనల్ 'ఓం నమో వెంకటేశాయ' రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. వారిద్దరి కాంబినేషనల్‌లో వచ్చిన 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడి సాయి' చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సోమవారం(ఆగస్టు29) నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నాగ్ హాథీరామ్ బాబాగా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. వెంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్ నటిస్తుండగా..భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క నటిస్తోంది.ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జగపతిబాబు, ప్రగ్యాజైస్వాల్, విమలారామన్, రావు రమేశ్, వెన్నెల కిషోర్, ప్రభాకర్, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









