ఖతార్‌లో 57 ఫుడ్ కేంద్రాలు మూసివేత..!!

- November 12, 2026 , by Maagulf
ఖతార్‌లో 57 ఫుడ్ కేంద్రాలు మూసివేత..!!

దోహా: ఖతార్‌లో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన 57 ఆహార విక్రయ కేంద్రాలను మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ మూసివేసింది. 2026 మూడో త్రైమాసికంలో మొత్తం 6,088 ఉల్లంఘనలను గుర్తించినట్లు తాజా మున్సిపల్ కార్యకలాపాల నివేదిక వెల్లడించింది.

జూలై నుంచి సెప్టెంబర్ వరకు మున్సిపాలిటీల పరిధిలో 81,611 ఆరోగ్య తనిఖీలు, 31,614 టెక్నికల్ తనిఖీలు నిర్వహించారు. వీటితోపాటు 47,846 సాధారణ తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో 8,427 ప్రకటనల అనుమతులు జారీ చేశారు. అదే సమయంలో దోమలు, ఇతర కీటకాలు, ఎలుకల నివారణ కోసం 25,091 ప్రత్యేక చర్యలు చేపట్టగా, ప్రజల నుంచి వచ్చిన 3,919 ఫిర్యాదులను పరిష్కరించారు.

దోహా మున్సిపాలిటీ పరిధిలో 20,870 ఆరోగ్య తనిఖీలు, 4,006 టెక్నికల్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1,495 ఉల్లంఘనలు గుర్తించి, నిబంధనలు పాటించని 14 ఆహార విక్రయ కేంద్రాలను మూసివేశారు. అల్ వక్రా మున్సిపాలిటీ పరిధిలో 18,104 ఆరోగ్య తనిఖీలు, 11,109 సాంకేతిక తనిఖీలు నిర్వహించగా, 12 ఆహార విక్రయ కేంద్రాలను మూసివేశారు.

ఖతార్ వ్యాప్తంగా ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ, మున్సిపల్ సేవల మెరుగుదల, కీటకాల నియంత్రణ వంటి అంశాలపై చేపట్టిన చర్యలను ఈ త్రైమాసిక నివేదికలో మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com